అన్వేషించండి

Chiranjeevi: అప్పట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా... పవన్, చరణ్, ‘మెగా’ హీరోలంతా నేను సాధించిన అచీవ్‌మెంట్సే - చిరంజీవి

Megastar Chiranjeevi Speech at APTA: ఇప్పటి వరకు నేను ఎవరితో షేర్ చేసుకోని కొన్ని విషయాలను ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను అంటూ హైదరాబాద్‌లో జరిగిన ఆప్త ఈవెంట్‌లో చిరు చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi Full Speech APTA Katalyst: పవన్ కళ్యాణ్, రామ్ చ‌ర‌ణ్‌, నా ఫ్యామిలీలోని నా బిడ్డ‌లంద‌రూ నా అచీవ్‌మెంటే అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. హైద‌రాబాద్‌లో జరిగిన ఆప్త‌(అమెరిక‌న్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియ‌ష‌న్‌) బిజినెస్ కాన్ఫ‌రెన్స్ మీటింగ్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో యంగ్ పారిశ్రామిక వేత్తల్లో స్ఫూర్తి నింపేలా.. తను శివశంకర వరప్రసాద్ నుండి చిరంజీవిగా, మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగిన తీరును చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ...  

‘‘ఇలాంటి స‌భ‌ల్లో ఏం మాట్లాడాల‌నే దానిపై నాకు అవ‌గాహ‌న లేదు. నిజం చెప్పాలంటే ఎంటర్‌ప్రెన్యూరర్‌కి ప్రాపర్ స్పెల్లింగ్ కూడా సరిగా తెలియదు నాకు. అలాంటిది యంగ్ ఎంట‌ర్‌ప్రెన్యూరర్స్‌‌కి స్ఫూర్తినింపేలా ఏమైనా చెప్పాలంటే... ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఒక మనిషి అభివృద్ధిలోకి రావడానికి ఎడ్యుకేషన్ సంస్థలు ఏమైతే చెబుతాయో.. అవన్నీ కూడా బహుశా కాలేజీల‌కు వెళ్లి చ‌ద‌వ‌కుండానే మ‌నం నేర్చుకున్నామేమో.. అవి మన మ‌న‌సుల్లో ఉండి, మన ఎదుగుదలకు కారణమయ్యాయేమో అని అనిపించింది. నేను ఈ రోజున నో వేర్ నుండి సమ్‌థింగ్, స‌మ్ వేర్ అనే స్థాయికి వ‌చ్చానంటే అవన్నీ నా అంతరంగంలో ఉండి నన్ను నిలబెట్టాయేయో అని అనిపిస్తుంది. కాబట్టి, నా గురించి, నా ఎదుగుదల గురించి, న‌న్ను నేను మ‌లుచుకున్న విధానం బ‌ట్టి, ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను దాటి అనుకూల ప‌రిస్థితుల‌ను ఏర్పాటు చేసుకుని, ఎలా ఎదుగుతూ వ‌చ్చాన‌నేది చెబితే చాలు.. అంతా చదువుకున్న వాళ్లే కాబట్టి.. అందులో నుంచి మీరందరూ మీ మీ గమ్యానికి అన్వయించుకోవచ్చని, అందరినీ ఆలోచింప చేస్తుంద‌నిపించింది. అందుకోసం నా గురించి చెప్పుకోవాల్సి వస్తే కనుక..

Also Read: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?

నేను ఓ సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన వ్య‌క్తిని. ఇప్పటి వరకు నేను ఎవరితో షేర్ చేసుకోని కొన్ని విషయాలను ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. తద్వారా ఎంతోమందిని అది ఆలోచింప చేస్తుందని భావిస్తున్నాను. నాకు చిన్నప్ప‌టి నుంచి ఆట‌లంటే చాలా ఆసక్తిగా ఉండేది. ఆటలంటే ఎవరికి ఇష్టం ఉండదు. బాల్ బాడ్మింట‌న్‌కు వెళ్లాను అక్క‌డ బాల్ నా కంటికి త‌గిలి వాచిపోయింది. త‌ర్వాత వాలీబాల్ ఆట ఆడుదామ‌ని వెళితే అక్క‌డ కూడా బాల్ త‌గిలి వేళ్లు వంగిపోయాయి... ఇక ఆ ఆట అంటే భయమేసింది. ఆ తర్వాత క్రికెట్‌కు వెళితే బాల్ బొట‌న‌వేలుకి తగిలి వాచిపోయింది. దీంతో గేమ్స్ అచ్చిరాద‌నిపిస్తున్న త‌రుణంలో ఎన్‌సీసీలో జాయిన్ అయ్యాను. అందులో క్యాడెడ్‌గా మొదలుకుని అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ.. సీనియర్ క్యాడెడ్ కెప్టెన్‌ని అయ్యాను. బీకాం ఫైన‌ల్ ఇయ‌ర్‌లో ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి రోడ్డుపై రిపబ్లిక్‌‌ డే రోజు మన సైన్యంతో క‌లిసి నేను కూడా క‌వాతు చేయడం జరిగింది. అదెంత గొప్ప అనుభ‌వం అంటే.. ప్ర‌ధాని ఇందిరాగాంధీగారు, రాష్ట్ర‌ప‌తిగారున్నారు. ఇది కదా మనం సాధించింది అని చాలా గర్వంగా అనిపించింది. ఆ త‌ర్వాత ఏంటి అంటే నాకు దారేం కనబడలేదు. దాని గురించి ఆలోచించిన‌ప్పుడు, కాలేజీలో అనుకోకుండా ‘రాజీనామా’ అనే డ్రామాలో యాక్ట్ చేశాను. దాంతో కాలేజ్‌లో న‌న్ను అంద‌రూ హీరోలాగా చూడ‌టం ప్రారంభించారు. అమ్మాయిలు అలా చూస్తుంటే యమా ఖుషీగా అనిపించేది. అప్పుడే నా భ‌విష్య‌త్ న‌ట‌న అయితే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌కు నాంది ప‌డింది. అక్కడే సినిమాల వైపు నా చూపు పడింది. కాలేజ్ చ‌దువు అయిపోగానే మ‌ద్రాస్‌లో యాక్టింగ్ స్కూల్‌కి వెళ‌తాన‌ని నాన్న‌గారికి చెప్ప‌గానే అక్క‌డ మ‌న‌కు ఎవ‌రూ తెలియ‌దురా.. అని అన్నారు. ఏం తెలియ‌ని ఫీల్డ్‌కు వెళ్లి రాణించ‌గ‌ల‌వా? అని అన్నారు. అయితే నా మ‌న‌సులో మాత్రం నేను త‌ప్ప‌కుండా రాణిస్తాన‌నే గ‌ట్టి న‌మ్మ‌కం అయితే ఉంది. అది కాకుండా ఏ జాబ్ అనుకున్నా నాకు కిక్ ఇవ్వడం లేదు. అదే సినియా యాక్టర్ అయితే యా.. అనిపించింది. అప్పుడు సినిమాలపై దృష్టి పెట్టాను. అంతే నాలుగు ఫొటోలు పట్టుకుని, లింగు లిటుకు మంటూ సినిమా ఆఫీస్‌ల దగ్గరకు వెళితే.. ఎవరూ ఆదరించరు. నేను యాక్టింగ్ స్కూల్‌లో ట్రైనింగ్ అయ్యాను. అయితే నాకు ట్రైనింగ్ పూర్తి చేయ‌క ముందే నాకు ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమాల్లో అవ‌కాశాలిచ్చారు. నేను ఫొటోలు తీసుకుని ఏ ఆఫీస్‌కు వెళ్లలేదు, ఏ ఆడిషన్‌కు వెళ్లలేదు. అప్పట్లో.. తెలియకుండా ఎప్పుడైనా పాండిబజార్‌కి వెళ్లేవాడిని. అక్కడ ఫ్రస్టేటెడ్ పీపుల్ టీలు, కాఫీలు తాగుతూ ఉండే కొంత మంది నెగెటివ్‌గా మాట్లాడేవాళ్లు.. ఇక్కడ చూడు నీకంటే అందగాళ్లు ఉన్నారు. ఇక్కడ వెనుకాల నా అనేవాళ్లు లేకపోతే రాణించలేవు అని అంటుంటే కుంగిపోయేవాడిని, రూమ్‌కెళ్లి నిద్ర‌పోయేవాడిని కాదు. ఒక్కోసారి నాకున్న నమ్మకం సడలిపోయేది. ఆరోజు నాకు ఆంజ‌నేయ‌స్వామి మాత్ర‌మే తోడుగా ఉండేవాడు. ఆయ‌న‌తోనే మ‌న‌సులో మాట్లాడుకునేవాడిని. ఆయ‌నే నాకు స‌మాధానం చెబుతున్న‌ట్లు ఉండేది. ఫ్రస్ట్రేటెడ్ వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌కు అని ఆ భ‌గ‌వంతుడే చెప్పాడా?  లేక నా అంత‌రాత్మే చెప్పిందో తెలియ‌దు కానీ.. అప్ప‌టి నుంచి అటువైపు వెళ్లకూడదు అని అనుకున్నాను. అప్పటి నుండి అటువైపు, నెగిటివిటీ వైపు వెళ్లలేదు.

ఒక ఉదాహరణ చెబుతాను. ఒక అద్భుతమైన బిల్డింగ్ కడుతూ.. స్లాబ్ వేస్తాం. అది వేసేటప్పుడు అన్ని రకాల ఎంక్వయిరీ చేసుకుంటాం. ఎందుకంటే ఆ ఒక్క రోజు ఎటువంటి వాన పడకూడదు కాబట్టి. కానీ 24 గంటల తర్వాత ఆ స్లాబ్‌‌పై నీరు నిల్వఉండేలా చేస్తుంటాం. అలా నిల్వ చేసిన నీరు ఆ శ్లాబ్‌‌కు మరింత బలాన్ని ఇస్తుంది. అంటే మనం మానసికంగా గట్టిగా ఉన్నప్పుడు ఏ నెగిటివిటీ మనల్ని ఏం చేయలేదు. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే.. పెరుగు తోడుకుంటున్నప్పుడు ఒక ఉప్పు కణిక, లేదంటే నిమ్మరసం చుక్క పడితే చాలు ఆ తోడు విరిగిపోతుంది. అదే పెరుగు గడ్డ గట్టిన తర్వాత అదే నిమ్మకాయ, అదే ఉప్పు వేస్తే వచ్చే రుచే వేరు. అంటే, మనం ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ వైపు వెళ్లకూడదు. నీ మనసునే నమ్ముకోవాలి. క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టిన గుర్రంలాగా ల‌క్ష్యం వైపు ప్ర‌యాణిస్తూనే ఉండాలి. నేను నిజం చెబుతున్నాను. నేను ఎటువంటి వ్యసనాలకు లోను కాకుండా.. ఆంజనేయ స్వామి భక్తుడిగా ఉండేవాడిని. సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్ కావాల‌నేదే నా ధ్యేయం. ఈ లోపు నాకు అవ‌మానాలు కూడా ఎదుర‌య్యాయి. అయితే నాకున్న ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మార్చుకుంటూ ప్ర‌యాణించాను. నాకు నేనుగా నేర్చుకున్న ఫిలాస‌ఫీతో ముందుకు వెళ్లాను. ఇంకా చెప్పాలంటే చాలా డిజప్పాయింట్ అంశాలు జరిగాయి నాకు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌గారితో ‘తిరుగులేని మ‌నిషి’ చిత్రంలో న‌టించాను. దేవీ ప్రసాద్ గారు నిర్మాత. ఆ సినిమాలో నాకు మంచి పేరు వ‌చ్చింది. కానీ సినిమా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్‌గారితో మ‌రో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. నా ద‌గ్గ‌ర డేట్స్ కూడా తీసుకున్నారు. నేను వెయిట్ చేస్తున్నాను. నా పేరు లేకుండా మ‌రో న‌టుడికి అవ‌కాశం రావ‌టంతో ఎంతో డిజప్పాయింట్ అయ్యాను. అప్పుడు అదేంటని నిర్మాతని అడిగాను. అయితే ఆ టైమ్‌లో నాతో సినిమా చేస్తే పోతుంద‌నే బ్యాడ్ అయ్యే అవ‌కాశాలున్నాయి. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే నన్ను ఐరన్ లెగ్ అంటూ.. వెనక్కి పంపేవారు. దీంతో కాస్త జంకాను. అయితే మ‌ళ్లీ గ్రద్ద‌లాగా పాజిటివ్‌గా తీసుకుని ఎదిగాను. దానిని పాజిటివ్‌గా తీసుకున్నాను. ఎవ‌రైతే చిరంజీవి వ‌ద్దులే అని అనుకున్నారో ఆయ‌న‌తోనే రామారావుగారి కంటే నాలుగు సినిమాలు ఎక్కువ‌గా చేసేలా చేసుకున్నాను. అది మనకు పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం అంటే. ఆ రోజు నాలో ఉన్న కసిని నెగిటివిటీ వైపు మార్చుకుంటే కనుక.. అది నన్ను తినేసేది. కానీ నేను ఎదురుతిరిగి.. పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నాను. ఆయ‌నతో చేసిన సినిమానే కోటి రూపాయ‌లు వ‌సూలు చేసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. ఆ తర్వాత ఒక్కో ఏరియాలోనే కోటి, నా రెమ్యూనరేషనే కోటి ఇలా మారుతూ వచ్చింది. అందుకే నేను చెప్పేది ఏమిటంటే.. మీ బ‌లం పాజిటివ్ థింకింగ్‌. మీకున్న ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మార్చుకోవాలి. ప్రారంభంలో ల‌క్ష్య సాధ‌న‌లో నిల‌దొక్కుకోవాలి. డ‌బ్బు ప్ర‌ధానం కాదు. నిలదొక్కుకోవడం ప్రధానం. మనం నిల‌బ‌డ్డ త‌ర్వాత డ‌బ్బు దానంత‌ట అదే వ‌స్తుంది. నాతో ప‌ని చేయ‌ని వాళ్లు, మ‌ళ్లీ చిరంజీవితో సినిమా చేయాలి అనుకునేలా నా ప్ర‌వ‌ర్త‌న ఉండేది. నాకు పౌరుషం లేదు అని చెప్పడం లేదు.. కాస్త త‌గ్గ‌టం వ‌ల్ల వ‌చ్చే వేవ్స్ ఆటోమెటిక్‌గా న‌న్ను పైకి తీసుకెళుతుంది. అది నమ్మిన వాడిని నేను. సినీ ఇండ‌స్ట్రీలో టాలెంట్ అనేది సెకండ‌రీ.. నిర్మాత‌ల‌తో ఎలా ఉంటావు.. వాళ్ల‌కు ఎలా స‌పోర్ట్ చేశావ‌నేది చూసుకోవాలి. టాలెంట్‌తో పాటు నీ బిహేవియ‌ర్ కూడా ఉండాలి. వాళ్లకి లాభం ఎలా చేకూర్చాలి అని ఆలోచనే నన్ను పైకి తీసుకువచ్చింది. రామారావుగారు పాలిటిక్స్‌కి వెళ్లిన త‌ర్వాత ఆ గ్యాప్‌లో ఎందరో మ‌హా న‌టులు.. నాగేశ్వ‌ర‌రావుగారు, శోభ‌న్‌బాబుగారు, కృష్ణంరాజుగారు, కృష్ణ‌గారు వంటి వారు ఉన్నారు. అయితే అప్పుడు ఓ కొత్త వాడికి చాన్స్ రావ‌టం అనేది ఎంత క‌ష్ట‌మైన విష‌య‌మో నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ రోజుల్లాగా మాత్రం కానే కాదు.

నాకు టాలెంట్ ఉంది కదా.. అని అనుకుంటే కుదరదు. నీ బిహేవియర్ కూడా ఇక్కడ ఎంతో ముఖ్యం. ఆ ఏంటంట అని కొంచెం ఎక్కించుకుంటే చాలు.. మనలాంటి బెస్ట్ యాక్టర్స్ చాలా మంది ఉంటారు. వాళ్లవైపు మైండ్ వెళ్లిపోతుంది. కాబట్టి మ‌న ఎదుగుద‌ల‌తో వ్య‌క్తిత్వం ఎంతో కీల‌క‌మైన పాత్ర పోషిస్తుంది. అందరితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. నన్ను ఇండస్ట్రీ గుర్తించలేదు. ముందు నన్ను ప్రేక్ష‌కులు గుర్తించి చేయూత‌నిచ్చారు. అందుకే ప్రేక్షకుల పట్ల ఎప్పుడూ నాకు కృతజ్ఞత ఉంటుంది. రామారావుగారు రాజ‌కీయాల్లోకి వెళ్లిన త‌ర్వాత ఎవ‌రున్నార‌ని అంద‌రూ అనుకుంటుంటే ముగ్గురు హీరోలు నువ్వా నేనా అన్న‌ట్లుండేవాళ్లం. ఆ స‌మ‌యంలో డిస్ట్రిబ్యూష‌న్ సిస్ట‌మ్‌తోనే సినిమాలు న‌డిచేవి. ఓ హీరోతో యాబై ల‌క్ష‌ల‌తో చేయాలని నిర్మాత‌లు అనుకుంటుంటే విజ‌య‌వాడ‌కు చెందిన ల‌క్ష్మీ ఫిలింస్ లింగ‌మూర్తిగారు చిరంజీవిగారితో అయితే పాతిక ల‌క్ష‌ల్లోనే చేయ‌వ‌చ్చు.. అలా చేస్తే మేం పెట్టుబ‌డి పెడ‌తాం అన్నారు. అత‌నెందుకు? అని నిర్మాత‌లంటే.. అత‌ను ఆల్ రెడీ ‘ఖైదీ’ లాంటి సినిమా చేశాడు.. అత‌ని డాన్సుల‌కు, ఫైట్స్‌కు మంచి ఆద‌ర‌ణ వ‌స్తుంది. అత‌ని పొటెన్షియ‌ల్ మాకు తెలుసున‌ని అన్నారు. చెన్నైలో ఉండేవాళ్లు సంశయించారు. అప్ప‌ట్లో సాంగ్స్‌, ఫైట్స్ అనేవి రిఫ్రెష్‌మెంట్స్‌గా ఫీల్ అయ్యేవాళ్లని, చిరంజీవి సాంగ్స్‌, ఫైట్స్‌ను ప్రేక్ష‌కులు అడిగి మ‌రీ రిపీటెడ్‌గా చూస్తున్నార‌ని లింగ‌మూర్తిగార‌న్నారు. ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారు కాబ‌ట్టి నాకు ఆద‌ర‌ణ ద‌క్కింది. డిస్ట్రిబ్యూటర్స్ కోరుకుంటున్నారు కాబట్టి.. అప్పుడు నిర్మాతలు నావైపు చూవారు.

ఆ త‌ర్వాత రామారావుగారి నిర్మాత‌లు దేవీ ప్ర‌సాద్‌గారు, చ‌ల‌సాని గోపీగారు, త్రివిక్ర‌మ్‌ గారు, ఏడిద నాగేశ్వ‌ర‌రావుగారు.. వంటి వారంతా నా షూటింగ్స్‌కు వచ్చి మాట్లాడేవాళ్లు. అప్పుడు అనిపించేది.. ఇది కదా నా బలం, ఇది కదా నేను సాధించుకున్నాను అని. రామారావుగారి నిర్మాత‌లు నాతో సినిమాలు చేస్తున్నారంటే నేను నెంబ‌ర్ వ‌న్ హీరో అయ్యాన‌నిపించింది. అయ్యాన‌ని కాల‌ర్ ఎగరేస్తే ఏమ‌వుతుందో కూడా నాకు తెలుసు. అందుక‌నే అణిగిమ‌ణిగి ఉండాల‌ని, క‌ష్ట‌ప‌డి ప‌ని చేశాను. క‌ష్ట‌ప‌డితే ఆ నెంబ‌ర్ అలాగే ఉంటుంది త‌ప్ప ఎక్క‌డికీ పోదు. ఈ రోజు ఇక్కడ ఏం చెప్పాలని ఆలోచిస్తూ.. గూగుల్ చేశాను. మ‌న నైపుణ్య‌మేంటో గుర్తించాలి, రిస్క్ తీసుకోవాలి, డిఫ‌రెంట్ ల‌క్ష్యాల‌ను ఏర్ప‌రుచుకోవాలి.. ఇవే ఎంట‌ర్‌ప్రెన్యూర‌ర్‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణాలు. అవ‌న్నీ నాకు నేనుగా ఫాలో అయ్యాను. అవన్నీ నాలో ఉన్నాయి కాబట్టే.. నేను చెప్పగలుగుతున్నాను. నేను ఆరోజు ఎంతో కష్టపడ్డాను. పగలు షూటింగ్, రాత్రి కాలేజ్ ఇలా ఉండేది. ఇక ఫైట్స్‌, డాన్స్ సినిమాలే కాదు, ‘స్వ‌యం కృషి, చంటబ్బాయ్’ వంటి వైవిధ్య‌మైన సినిమాలెన్నో చేశాను. ప్రేక్ష‌కుల‌ను మోనాట‌నీగా ఫీల్ కాకుండా చేస్తూ వ‌చ్చాను. మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టుగా క‌థ‌ల‌ను మార్చుకుంటూ సినిమాలు చేశాను. నా సీనియ‌ర్ న‌టీన‌టుల నుంచి మంచి విష‌యాల‌ను నేర్చుకుంటూ వ‌చ్చాను. అప్పుడు, ఇప్పుడు కూడా నా అభిమానులే నాకు కొండంత అండ‌గా నిల‌బ‌డ్డారు. వారి స‌హకారంతోనే నేను బ్ల‌డ్ బ్యాంకుని స్థాపించి స‌క్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళుతున్నాను. అలాగే ఆప్త వాళ్లు కూడా ఎన్నోసార్లు అమెరికాలో ర‌క్త‌దాన శిబిరాల‌ను నిర్వ‌హించారు. ఇలా నా గురించి నేను చెప్పుకోవ‌టంలోనే తెలియ‌కుండా మీ అంద‌రికీ చెప్పాల్సిన విష‌యాల‌ను చెప్పాన‌ని అనుకుంటున్నాను. 

Also Read : బాబాయ్ - అబ్బాయ్ బాండింగ్ చూశారా... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో హైలైట్ మిస్ అవ్వొద్దు

ఈ తీరుతో మ‌నం ముందుకు వెళితే ఎదురు ఉండ‌దు. నా ప్రయాణంలో నేను ఇన్‌స్పిరేష‌న్‌గా ఎలాగైతే నిలిచానో ఇక్క‌డున్న వారంద‌రూ భ‌విష్య‌త్తులో రాబోయే ఎంట‌ర్‌ప్రెన్యూరర్స్‌కి ఇన్‌స్పిరేష‌న్‌గా నిల‌వాల‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, నా ఫ్యామిలీలోని నా బిడ్డ‌లంద‌రూ నా అచీవ్‌మెంటే. మొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు.. ‘అన్న‌య్య నువ్వొక మాట అనేవాడిని గుర్తుందా.. మ‌న ఇంట్లో ఇంత మంది మీరున్నందుకు? ఈ అవకాశం నాకు భ‌గ‌వంతుడు ఇచ్చినందుకు, ఇది నాతో ఆగిపోకూడ‌దు. ఒక రాజ్ క‌పూర్ ఫ్యామిలీలో ఎంత మంది ఎలా ఉన్నారో, ఆ ర‌కంగా మ‌రో రాజ్ క‌పూర్ ఫ్యామిలీలా మ‌న మెగా ఫ్యామిలీ కావాల‌ని నువ్వు చెప్పావు’ అన్నారు. ఈరోజు నీ మాట మంత్రంలాగా ప‌ని చేసిందన్నయ్యా.. నువ్వు క‌న్విక్ష‌న్‌తో అంటావు.. అందులో ఎలాంటి పొల్యూష‌న్ ఉండ‌దు. ఈ మ‌ధ్య ఓ ప‌త్రిక క‌పూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అని మా గురించి ప్ర‌స్తావించిన‌ప్పుడు.. భ‌గ‌వంతుడా! ఇది నా గొప్ప‌తనం కాదు, నువ్వు, ప్రేక్ష‌కులు, అభిమానులు ఇలా ఆద‌రించారు కాబ‌ట్టే ఇక్క‌డున్నాము అని అనుకున్నాను.. అని మెగాస్టార్ తన సుదీర్ఘ ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
KTR Comments On Revanth Reddy: ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
BJP Vishnu:  వైసీపీ గతే తెలంగాణ కాంగ్రెస్‌కు -  పార్టీ ఆఫీసులపై దాడులపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడి హెచ్చరిక
వైసీపీ గతే తెలంగాణ కాంగ్రెస్‌కు - పార్టీ ఆఫీసులపై దాడులపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడి హెచ్చరిక
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Pushpa-2 Reload: గేమ్‌ ఛేంజర్‌ను సవాల్ చేస్తున్న పుష్ప-2- జనవరి11న రీలోడ్ వెర్షన్‌ రిలీజ్‌
గేమ్‌ ఛేంజర్‌ను సవాల్ చేస్తున్న పుష్ప-2- జనవరి11న రీలోడ్ వెర్షన్‌ రిలీజ్‌
Embed widget