అన్వేషించండి

Chiranjeevi - Rangamarthanda :ప్రతి నటుడి జీవితమిది, సెకండాఫ్ అంతా కంటతడి - 'రంగమార్తాండ'కు మెగా కాంప్లిమెంట్స్

Chiranjeevi Appreciates Rangamarthanda : కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా 'రంగమార్తాండ' చూశానని చిరంజీవి పేర్కొన్నారు. సినిమా గురించి ఆయన ఏమన్నారంటే...

కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన తారలుగా రూపొందిన సినిమా 'రంగమార్తాండ' (Rangamarthanda Movie). 'మన అమ్మానాన్నల కథ'... అనేది ఉపశీర్షిక. ఇప్పుడీ సినిమా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హృదయాన్ని కదిలించింది. ఇటీవల ఆయన సినిమా చూశారు. తనకు ఏమనిపించిందో సోషల్ మీడియాలో చెప్పారు. 

త్రివేణీ సంగమంలా అనిపించింది!
''నేను 'రంగమార్తాండ' చూశాను. ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఇది ఒకటి. ప్రతి నటుడికి తన జీవితాన్నే కళ్ళ ముందు చూస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే, ఈ సినిమా ఓ 'త్రివేణీ సంగమం'లా అనిపించింది. కృష్ణవంశీ లాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్, ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, ఒక హాస్య బ్రహ్మానందంల కలయిక, వాటి పనితనం, ముఖ్యంగా ఆ ఇద్దరి నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది'' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

సెకండ్ హాఫ్ కంటతడి...
బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న పాత్ర చేయడం తొలిసారి అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. సెకండ్ హాఫ్ అంతా అప్రయత్నంగానే కంట తడి నిండిందని ఆయన తెలిపారు. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇటువంటి సినిమాలు అందరూ తప్పకుండా చూసి ఆదరించాలని ఆయన అభిప్రాయ పడ్డారు. కృషవంశీ, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ... చిత్ర బృందం అందరికీ ఆయన అభినందలు తెలిపారు. 

Also Read మీనా రెండో పెళ్లి - వయసులో చిన్నోడు, విడాకులు తీసుకున్న హీరోతో?

ఉగాది కానుకగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలోకి 'రంగమార్తాండ' వచ్చింది. ఈ నెల 22న విడుదల అయ్యింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. 

కంటతడి పెట్టించిన బ్రహ్మానందం
'రంగమార్తాండ'లో బ్రహ్మానందం (Brahmanandam) నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. తెలుగులో సుమారు వెయ్యికి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ఒకటి ఆరా మినహాయిస్తే మెజారిటీ సినిమాల్లో కామెడీ వేషాలు వేశారు. అటువంటి బ్రహ్మిలో సీనియర్ నటుడిని కృష్ణవంశీ తెరపై ఆవిష్కరించారు. వినోదం కాకుండా నటనతో బ్రహ్మానందం విశ్వరూపం చూపించారు. ఆయన నటన తమ గుండెలను కదిలించిందని చాలా మంది చెబుతున్నారు. సామాన్యులతో పాటు స్టార్ హీరోలను సైతం బ్రహ్మి నటనకు మంత్రముగ్దులు అవుతున్నారు. 

బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం
బ్రహ్మానందం నటించిన పాత్రకు మంచి పేరు రావడంతో ఆయన్ను మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించారు.

Also Read : నువ్వు మారవా విష్ణు? - మంచు బ్రదర్స్ గొడవలో శాక్రిఫైజింగ్ స్టార్ సెన్సేషనల్ కామెంట్స్
 

హౌస్ ఫుల్ మూవీస్, రాజ్య శ్యామల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కాలిపు మధు, వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఆకెళ్ల శివప్రసాద్ సంభాషణలు రాయగా... లక్ష్మీ భూపాల, కాకర్ల శ్యామ్, భల్లా విజయ కుమార్ సాహిత్యం అందించారు. లక్ష్మీ భూపాల రాసిన షాయరీకి చిరంజీవి తన గళం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 'రంగమార్తాండ' థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా విడుదల కానుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Allu Arjun Father-in-law: కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Allu Arjun Father-in-law: కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Viral News: ఇద్దరు భర్తలు -  రెండు మంగళసూత్రాలు - ఒకే మంచం, ఒకే కంచం - ఈ మహిళ సతీలీలావతి కంటే ఎక్కువే
ఇద్దరు భర్తలు - రెండు మంగళసూత్రాలు - ఒకే మంచం, ఒకే కంచం - ఈ మహిళ సతీలీలావతి కంటే ఎక్కువే
Embed widget