By: ABP Desam | Updated at : 10 Jun 2023 01:34 AM (IST)
Image Credit: Varun Tej, Lavanya/Instagram
టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. మణికొండలోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా హాజరై సందడి చేశారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్, లావణ్యలు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ సమాచారం బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు స్వయంగా తమ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘Found my Lav’ అంటూ వరుణ్, ‘Found my Forever’ అంటూ వరుణ్, లావణ్యలు తమ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ ఫ్యామిలీలు నాగబాబు ఇంటికి వెళ్తున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Dimple queen #LavanyaTripathi arrived😍 #varunlavanyaengagement#varuntej@Itslavanya #varunlav pic.twitter.com/Qrv9G9UvA6
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) June 9, 2023
వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం చేసుకోబోతున్నారనే విషయం ప్రేక్షకులకు పెద్దగా ఆశ్చర్యం ఏమీ కలిగించలేదు. ఆల్రెడీ తెలిసిన విషయమే. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు చేయనప్పటికీ... ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని, అది కూడా అతి త్వరలో ఉంటుందని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Mega Power Star @AlwaysRamCharan garu & @upasanakonidela garu at #𝐕𝐚𝐫𝐮𝐧𝐋𝐚𝐯 💕 engagement ceremony !@IAmVarunTej @Itslavanya#VarunTej #LavanyaTripathi pic.twitter.com/OGGaVao3OI
— RC Yuvashakthi KA (@RCYuvashakthiKA) June 9, 2023
Icon Staar @alluarjun garu arrived at #𝐕𝐚𝐫𝐮𝐧𝐋𝐚𝐯 💕 engagement ceremony !@IAmVarunTej @Itslavanya#VarunTej #LavanyaTripathi pic.twitter.com/Mc93IceHRo
— Sheik Mosin (@mosinalways4u) June 9, 2023
'మిస్టర్'లో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి తొలిసారి జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణలో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత 'అంతరిక్షం'లో మరోసారి జంటగా నటించారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. వరుణ్ తేజ్ సోదరి నిహారికా కొణిదెల వివాహానికి పరిశ్రమ నుంచి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. ఆ అతిథుల జాబితాలో లావణ్యా త్రిపాఠి కూడా ఉన్నారు. రీతూ వర్మతో కలిసి వెళ్లారు. నిహారికకు వాళ్ళిద్దరు స్నేహితులే. అయితే... వరుణ్ తేజ్ ప్రేమ విషయం కూడా ఆ పెళ్ళిలో బయట పడింది. మెగా ఫ్యామిలీకి చెల్లెలి పెళ్ళిలో తన ప్రేమ సంగతి చెప్పారట.
ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలకు వస్తే... ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవదారి అర్జున' సెట్స్ మీద ఉంది. ఆ సినిమా చిత్రీకరణ కోసం ఆయన విదేశాలు వెళ్లి వచ్చారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమా ఒకటి చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. పెళ్లి సమయానికి షూటింగులు ఏవీ లేకుండా ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దర్శక నిర్మాతలకు ఆ విషయం చెప్పేశారట.
Read Also: చెర్రీ, తారక్‌లతో కలిసి పనిచేయాలని ఉంది - ‘థోర్’ హీరో క్రిస్ హేమ్స్ వెల్లడి, RRR మూవీపై ప్రశంసలు
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో
‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
/body>