Katragadda Murari : ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత
Katragadda Murari : ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి శనివారం రాత్రి కన్నుమూశారు.
Katragadda Murari : ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి(78) శనివారం రాత్రి కన్నుమూశారు. రాత్రి 8.50 నిముషాలకు చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. 1944 జూన్ 14న విజయవాడలో ఆయన జన్మించారు. సీతామాలక్ష్మి, త్రిశూలం, జానకీ రాముడు, గోరింటాకు , నారీ నారీ నడుమ మురారి చిత్రాలను కాట్రగడ్డ మురారి నిర్మించారు. యువచిత్ర ఆర్ట్స్ పేరుతో తొంభైవ దశకం వరకు పలు విజయవంతమైన చిత్రాలను కాట్రగడ్డ నిర్మించారు. సీతామహలక్ష్మి, గోరింటాకు, జానకీరాముడు, నారి నారి నడుమ మురారి, అభిమన్యుడు, సీతారామ కల్యాణం, శ్రీనివాస కల్యాణం, జేగంటలు చిత్రాలు నిర్మించారు. డాక్టర్ చదివి ఆ వృత్తి మానేసి దర్శకుడవుదామని సినీరంగ ప్రవేశం చేసిన మురారి చివరికి నిర్మాతగా మారారు. 2012లో నవ్విపోదురు గాక పేరుతో తన ఆత్మకథ రాశారు.
కాట్రగడ్డ మురారి ప్రస్థానం
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడలో 1944 జూన్ 14వ తేదీన కాట్రగడ్డ జన్మించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ లో ఎంబీబీఎస్ చదివారు. ఆ తర్వాత సినిమా పరిశ్రమపై మక్కువతో మద్రాసులో అడుగుపెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారభించిన కాట్రగడ్డ ఆ తర్వాత నిర్మాతగా మారారు. యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు. శోభన్ బాబు, కృష్ణంరాజు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్రహీరోలతో కాట్రగడ్డ సినిమాలు రూపొందించారు. 1978లో సీతామహాలక్ష్మి, గోరింటాకు, జేగంటలు, త్రిశూలం, అభిమన్యుడు, సీతారామకల్యాణం, శ్రీనివాస కల్యాణం, జానకీ రాముడు, నారి నారి నడుమ మురారీ సినిమాలు యువ చిత్ర బ్యానర్ లో నిర్మించారు. కాట్రగడ్డ మురారి నిర్మించిన చిత్రాలు మ్యూజికల్‌గా బ్లాక్‌బస్టర్లు అయ్యాయి. మురారి తీసిన అన్ని సినిమాలకు కేవీ మహాదేవన్ సంగీతం అందించారు.
ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) కన్నుమూత.. చెన్నైలోని తన నివాసంలో మృతి.. యువచిత్ర ఆర్ట్స్ పేరుతో గోరింటాకు, నారీ నారీ నడుమ మురారి, జానకి రాముడు, శ్రీనివాస కల్యాణం లాంటి సినిమాలు నిర్మించారు
— BA Raju's Team (@baraju_SuperHit) October 15, 2022
ఓం శాంతి #KatragaddaMurari pic.twitter.com/EW2sThY03m