By: ABP Desam | Updated at : 24 Aug 2023 12:57 PM (IST)
Photo Credit: Elon Musk/ News Think/twitter
భారత అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా జాబిలి దక్షిణ ధృవం మీద ప్రగ్యాన్ రోవర్ నడక మొదలు పెట్టింది. చంద్రయాన్ 3 సక్సెస్ అయిన నేపథ్యంలో స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. ‘గుడ్ ఫర్ ఇండియా’ అంటూ ట్వీట్ చేశారు. స్పేస్ నేపథ్యంలో తెరకెక్కిన హలీవుడ్ మూవీ ‘ఇంటర్‌స్టెల్లార్’ బడ్జెట్‌తో పోల్చడంపై స్పందించారు.
చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి న్యూస్‌థింక్ అనే ట్విటర్ అకౌంట్ లో ఓ పోస్టు పెట్టారు. భారత చంద్రయాన్ 3 ప్రయోగం బడ్జెట్ ను హాలీవుడ్ మూవీ ‘ఇంటర్ స్టెల్లార్’ బడ్జెట్ తో పోల్చారు. హాలీవుడ్ సినిమా ‘ఇంటర్‌స్టెల్లార్’ నిర్మాణం కోసం 165 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 1365 కోట్లు) కాగా, కేవలం 75 మిలియన్ డాలర్లు (రూ.620 కోట్లు) బడ్జెట్‌తో ఇస్రో చంద్రయాన్ 3ని ప్రయోగించిందని ఆ ట్వీట్ లో వెల్లడించారు. చంద్రయాన్ 3 బడ్జెట్ ‘ఇంటర్ స్టెల్లార్’ మూవీ బడ్జెట్ కంటే తక్కువ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది” అని సదరు ట్వీట్ లో వెల్లడించారు. ఈ ట్వీట్ కు మస్క్ స్పందించారు. ‘గుడ్ ఫర్ ఇండియా’ అని మస్క్ స్పందించారు.
Good for India 🇮🇳!
— Elon Musk (@elonmusk) August 22, 2023
చంద్రయాన్ 3పై మస్క్ స్పందించడంపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ సీరిస్ కంటే తక్కువ బడ్జెట్‌లో స్టార్ షిప్ ఎప్పుడు ప్రయోగాలు చేపడుతుంది? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భారత్ కు సపోర్టు చేసినందుకు మస్క్ కు మరికొంత మంది ధన్యవాదాలు చెప్తున్నారు. ఇంకొందరు ఇస్రోతో కలిసి పని చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ పలు అంతరిక్ష ప్రయోగాలు చేసింది. ఈ సంస్థకు చెందిన పలు రాకెట్లు ఇప్పటికే చాలా ఉపగ్రహాలను స్పేస్ లోకి తీసుకెళ్లాయి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో స్పేస్ ఎక్స్ కీలక ఒప్పందాలు చేసుకుంది. నాసా రూపొందించే ఉపగ్రహాలను స్పేస్ లోకి ప్రవేశపెట్టేందుకు మస్క్ సంస్థ అంగీకరించింది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలను స్పేస్ ఎక్స్ రాకెట్స్ ద్వారానే చేపట్టేలా నాసా ప్రయత్నిస్తోంది.
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగింది. అందులో నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై తిరగడం మొదలు పెట్టింది. సుమారు 14 రోజుల పాటు ప్రగ్యాన్ చందమామపై పరిశోధన చేయనుంది.
Read Also: RRR నటుడు రే స్టీవెన్‌సన్‌కు డిస్నీ ప్లస్ అరుదైన గౌరవం, ‘Ahsoka’ సీరిస్‌లో ఘన నివాళి
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో
‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
/body>