Chandini Chowdary : మీడియాపై సీరియస్ అయిన హీరోయిన్ చాందిని చౌదరి - 'దానికే అంత ఫీల్ అవ్వాలా?'
chandini chowdary Serious on Media: హీరోయిన్ చాందిని చౌదరి ప్రస్తుతం హాట్‌టాపిక్ అయ్యింది. తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ఆమె మీడియాపై ఫైర్ అయ్యింది.
chandini chowdary Fires on Media: హీరోయిన్ చాందిని చౌదరి ప్రస్తుతం హాట్‌టాపిక్ అయ్యింది. తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ఆమె మీడియాపై ఫైర్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వారింది. మీడియాపై ఆమె ఫైర్ అయిన రీజన్ తెలిసి అంతా షాక్ అవుతున్నారు. దీనికే ఇంత అసహనం చూపించాలా? అని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకి అసలు విషయం ఏంటంటే. చాందిని రీసెంట్‌గా 'గామి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విధ్యాధర్ కాగిత దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమాలో చాందిని ప్రధాన పాత్ర పోషించింది.
ఇందులో హీరోకి సహాయం చేసే యువతి పాత్రలో కనిపించింది. చెప్పాలంటే ఈ సినిమాలో చాందిని చాలా చోట్ల రిస్క్ చేసింది. దాదాపుగా హియలయాల్లోనే చిత్రీకరించిన ఈ సినిమాలోని కొన్ని సీన్లలో ప్రాణం పెట్టిందని చెప్పాలి. హీరోకి సమానంగా, ధీటుగా సినిమాలోని కొన్ని సీన్స్‌లో ఆమె రిస్క్ చేసింది. అయితే తాజాగా ప్రెస్‌మీట్‌లో ఆమె ఆశ్చర్యకరంగా వ్యవహరించింది. గామీ హిట్ కావడంతో నేడు హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ చాందిని చౌదరి, డైరెక్టర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారు అక్కడ తిరుపతిలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చాందిని మాట్లాడుతూ.. "మా సినిమా ఇంత పెద్ద విజయం చేసిన ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలు. సినిమాకు ఈ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. ఈ విజయాన్ని మేము ఊహించలేదు. థియేటర్లో మా సినిమాను ఇంతగాఆదిరిస్తున్న చాలా చాలా థ్యాంక్స్. ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రోత్సహించడం చాలా మంచి పరిణామం. దీనివల్ల భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగత్మాక చిత్రాలు, కొత్త ఐడియాస్‌తో సినిమాలు తీసేందుకు ఇది పునాదిలా అవుతది. ఈ క్రమంలో ప్రెస్, ఆడియన్స్ నుంచి వస్తున్న ప్రేమ, సపోర్ట్‌కు మేమంత చాలా కృతజ్ఞతతో ఉన్నాం" అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం మీడియా నుంచి ఏమైన ప్రశ్నలు ఉన్నాయా? అన్నట్టుగా చూసింది. కానీ, ఎవరూ ఆమెను ఎలాంటి ప్రశ్న అడగలేదు.
పైగా హీరో వైపు తిరిగి మీరు చెప్పండి అని అనడంతో చాందిని వెంటనే అసహానికి గురైంది. తెలిసిందే హీరోయిన్లకు ఎలాంటి ప్రశ్నలు ఉండవు.. ప్రతి సినిమాలోనూ ఇదే జరుగుతుంది. ఏ సినిమా అయినా ఆ డైరెక్టర్, హీరోకి తప్పా హీరోయిన్లను ఎలాంటి ప్రశ్నలు ఉండవు.. ఎప్పటి నుంచో చూస్తున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చాందిని అల అనడంతో ఓ రిపోర్టర్ తన ఎక్స్‌పీరియన్స అడిగడంతో ఏదో ఆన్‌ద స్పాట్ ఎందుకులేండి.. అంటూ ఏదో మొక్కుబడిగా సమాధానం ఇచ్చింది. ఈ సినిమా తన పాత్ర చాలా బాగా నచ్చింది. అందుకే కష్టమైనా ఇష్టంతో చేశానంటూ రిప్లై ఇచ్చింది. దీంతో విశ్వక్ సేన్ చాందిని కామెంట్స్‌పై సరదగా స్పందించారు. ఈ దెబ్బతో ఈ ప్రెస్ మీట్ మొత్తం రాదని, ఈ ఒక్క కామెంట్స్ మాత్రమే వైరల్ అవుతాయనడంతో చాందిని నేను ఉన్నదే చెప్పాను కదా అంటూ అసహనం చూపించింది. ప్రస్తుతం చాందిని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.