అన్వేషించండి

Boyapati Srinu : అల్లు అర్జున్, సూర్యతో సినిమాల తర్వాత 'అఖండ 2' - మహేష్ బాబుతో కూడా...

'స్కంద' తర్వాత బోయపాటి శ్రీను లైనప్ భారీగా ఉండబోతోంది. రామ్ సినిమా విడుదల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలలో నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి ఆయన చెప్పుకొచ్చారు.

కమర్షియల్ సినిమాలు చేయడంలో బోయపాటి శ్రీను (Boyapati Srinu)ది సెపరేట్ స్టైల్. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తీసిన 'సరైనోడు' కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలతో ఆయన మళ్ళీ సినిమాలు చేయబోతున్నారు. 

బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తాజా సినిమా 'స్కంద'. ది ఎటాకర్... అనేది ఉప శీర్షిక. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రమిది. విమర్శకుల నుంచి సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. మాస్ & బి సి సెంటర్ ఆడియన్స్ నుంచి సినిమాకు వసూళ్లు బాగా వచ్చాయి. 'స్కంద' విడుదల తర్వాత బోయపాటి శ్రీను తీయబోయే సినిమా ఏది? ఈ ప్రశ్నకు తాజా ఇంటర్వ్యూలలో ఆయన జవాబు ఇచ్చారు.

అల్లు అర్జున్ & సూర్యలతో...
'సరైనోడు' కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సినిమా చేయనున్నట్లు బోయపాటి శ్రీను చెప్పారు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమా నిర్మించే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే... మెగాస్టార్ చిరంజీవి, బోయపాటి శ్రీను కలయికలో సినిమా చేయాలని గీతా ఆర్ట్స్ సంస్థ ప్లాన్ చేసింది. అందుకోసం దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చింది. అయితే... ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు. దాని స్థానంలో అల్లు అర్జున్, బోయపాటి సినిమా తెరకెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తమిళ అగ్ర కథానాయకుడు సూర్యతో బోయపాటి శ్రీను చేయనున్నారని కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమాను కూడా బోయపాటి శ్రీను కన్ఫర్మ్ చేశారు. 

రెండు సినిమాల తర్వాత 'అఖండ 2'
బోయపాటి శ్రీను తీసిన సినిమాల్లో 'అఖండ'ది స్పెషల్ ప్లేస్. కరోనా తర్వాత విడుదలైన ఈ సినిమా చూడటానికి థియేటర్లకు ట్రాక్టర్లలో ప్రేక్షకులు వచ్చారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలో ప్రకటించారు. అయితే... అది అల్లు అర్జున్, సూర్య సినిమాల తర్వాత అని బోయపాటి చెబుతున్నారు.

Also Read : 'యానిమల్'లో రణబీర్, రష్మిక ఫస్ట్ నైట్ అంత వయలెంట్‌గా ఉంటుందా?
  
మహేష్ బాబుతో కూడా తప్పకుండా...బోయపాటి శ్రీను లిస్టులో ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. గతంలో వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే... ఆ సినిమా కూడా పట్టాలు ఎక్కలేదు. మహేష్ హీరోగా సినిమా చేయాలని ఉందని బోయపాటి చెప్పారు. ఆయనతో కూడా తప్పకుండా సినిమా చేస్తానని అన్నారు. ప్రస్తుతం 'గుంటూరు కారం' చేస్తున్న మహేష్... ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. బోయపాటి శ్రీను చెప్పే కథ నచ్చితే... ఆ తర్వాతే మహేష్ డేట్స్ ఇవ్వవొచ్చు. 

'స్కంద' సినిమాకు వసూళ్లు వస్తున్నప్పటికీ... మరోవైపు విమర్శలు సైతం అదే స్థాయిలో వచ్చాయి. ముఖ్యంగా లాజిక్స్ లేవని కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూలలో వాటి గురించి కూడా ప్రస్తావన వచ్చింది. సినిమాల్లో రోడ్స్ మీద సాంగ్స్ తీస్తామని, నిజ జీవితంలో ఆ విధంగా చేయమని బోయపాటి శ్రీను వివరించారు.    

Also Read భార్య ఉండగా మరొక అమ్మాయితో - ఎఫైర్ రివీల్ చేసిన ఈటీవీ ప్రభాకర్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget