The Raja Saab: 'రాజా సాబ్'లో బొమన్ ఇరానీ క్యారెక్టర్ ఏమిటో తెలుసా... బర్త్ డే స్పెషల్ పోస్టర్ చూశారా?
Boman Irani In The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా 'ది రాజా సాబ్'లో విలక్షణ నటుడు బొమన్ ఇరానీ నటిస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Boman Irani Look In The Raja Saab: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా ప్రతిభావంతుడైన దర్శకుడు మారుతి కలయికలో రూపొందుతున్న సినిమా 'ది రాజా సాబ్'. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విలక్షణ నటుడు - బాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బొమన్ ఇరానీ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.
బొమన్ ఇరానీ బర్త్ డేకి స్పెషల్ పోస్టర్!
Boman Irani Birthday: డిసెంబర్ 2న బొమన్ ఇరానీ బర్త్ డే. ఈ సందర్భంగా 'ది రాజా సాబ్' చిత్ర బృందం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
Boman Irani Role In The Raja Saab: 'ది రాజా సాబ్' సినిమాలో సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ పాత్రలో బొమన్ ఇరానీ నటిస్తున్నారని, ఆయన క్యారెక్టర్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని చిత్ర బృందం పేర్కొంది.
Also Read: Linga Bhairavi Temple Photos: లింగ భైరవి దేవి టెంపుల్ ఫోటోలు... ఈ గుడిలోనే సమంత పెళ్లి జరిగింది
View this post on Instagram
The Raja Saab Release Date: సంక్రాంతి సందర్భంగా జనవరి 9న 'ది రాజా సాబ్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇదొక హారర్ కామెడీ సినిమా. ఇటీవల విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ అభిమానులను మెప్పించింది. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రమిది. దీనికి తమన్ సంగీత దర్శకుడు.





















