Nana Patekar: ‘జవాన్‘, ‘గదర్ 2‘ సిల్లీ మూవీస్ - నటుడు నానా పటేకర్ సంచలన వ్యాఖ్యలు
నటుడు నానా పటేకర్ బాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాక్సాఫీస్ దగ్గర కోట్ల రూపాయలు వసూళు చేసిన ‘జవాన్‘, ‘గదర్ 2‘ సిల్లీ మూవీస్ అంటూ వ్యాఖ్యానించారు.
బాలీవుడ్ దిగ్గజ నటులలో నానా పటేకర్ ఒకరు. ఆయన ఏ విషయాన్ని అయినా సూటిగా సుత్తిలేకుండా చెప్తారు. తన మనసుకు అనిపించింది బయటకు చెప్పడంలో ఎలాంటి మొహమాటం ఉండదు. సెలట్రీటల వ్యవహార శైలి నుంచి సినిమాల తీరు తెన్నుల వరకు జెన్యూన్ గా అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ది వ్యాక్సీన్ వార్’. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్న పటేకర్ పలు విషయాలపై స్పందించారు.
‘జవాన్‘, ‘గదర్ 2‘ సిల్లీ మూవీస్ పై షాకింగ్ కామెంట్స్
రీసెంట్ గా బాలీవుడ్ లో సంచలన విజయాలు అందుకున్న ‘గదర్ 2’, ‘జవాన్’ చిత్రాలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు నానా పటేకర్ ను అడిగారు. ఆ సినిమాలు సిల్లీ సినిమాలు అని వ్యాఖ్యానించారు. “ ‘గదర్2’, ‘జవాన్’ చిత్రాలు సిల్లీ సినిమాలు. ప్రేక్షకులు ఆత్మ లేని సినిమాలను చూడవలసి వస్తుంది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘వెల్‌కమ్’ సిరీస్ లో భాగంగా భాగంగా వస్తున్న 'వెల్‌కమ్ టు ది జంగిల్' చిత్రంలో నటుడు అనిల్ కపూర్ తో పాటు తనకు అవకాశం కల్పించకపోవడంపైనా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. చిత్రబృందానికి, ముఖ్యంగా అక్షయ్ కుమార్ (Akshay Kumar) కు తాము పాత నటుల మాదిరి కనిపించామేమో? అందుకే, తమకు ఛాన్స్ ఇవ్వలేదని చెప్పారు.
‘గదర్ 2’, ‘జవాన్’ చిత్రాలకు వసూళ్ల వర్షం
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన ‘గదర్2‘ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సినిమా విడుదలై నెల రోజులు గడుస్తున్నా, వసూళ్లు వర్షం కురిపిస్తూనే ఉంది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేర్ చేస్తోంది. దైవభక్తి కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 550 కోట్లు వసూళు చేసింది. భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సౌత్, నార్త్ అనే తేడా లేకుండా 'జవాన్' సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తక్కువ సమయంలో రూ.300 కోట్ల మార్క్ ని దాటికి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
సెప్టెంబర్ 28న ‘ది వ్యాక్సిన్ వార్’ విడుదల
వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బయో సైన్స్ చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’ లో నానా పాటేకర్, పల్లవి జోషి, సప్తమి గౌడ సహా పలువురు నటీనటులు ఇందులో కీలకపాత్రలు పోషించారు. సీనియర్ నటి రీమా సేన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. సెప్టెంబర్ 28న ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రం హిందీలో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల కానుంది.
Read Also: గుండె పగిలింది - జాహ్నవి మరణంపై స్పందించిన సమంత
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial