Alka Yagnik: బాలీవుడ్ సింగర్ అల్కా యాగ్నిక్‌కు అరుదైన వ్యాధి - షాక్‌లో మ్యూజిక్ ఇండస్ట్రీ, ఫ్యాన్స్
Singer Alka Yagnik: బాలీవుడ్ సింగర్ అల్కా యాగ్నిక్ అరుదైన వ్యాధి బారిన పడ్డారు. ఆ విషయాన్ని ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా షాక్‌కి గురైనదని చెప్పాలి.
సింగర్ అల్కా యాగ్నిక్ (Alka Yagnik Singer) గురించి ఈతరం తెలుగు ప్రేక్షకులు అంతగా తెలియకపోవచ్చు. కానీ, ఓ తరం ముందుకు వెళితే... ఆవిడ పాటలు వినని శ్రోతలు తక్కువ మంది అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. హిందీలో ఆమె వెరీ పాపులర్ సింగర్. ఇప్పుడు ఆవిడ అరుదైన వ్యాధి బారిన పడ్డారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా... మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
అరుదైన వినికిడి లోపంతో బాధపడుతున్న అల్కా యాగ్నిక్!
ఇప్పుడు తనకు ఏదీ వినపడటం లేదని అల్కా యాగ్నిక్ తెలిపారు. అరుదైన వినికిడి లోపం (rare sensory neural nerve hearing loss)తో తాను బాధ పడుతున్నట్టు ఆవిడ వివరించారు. సోషల్ మీడియాలో తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె సుదీర్ఘంగా రాసుకొచ్చారు.
''కొన్ని వారాల క్రితం నేను ఎయిర్ పోర్టులో ఫ్లైట్ నుంచి బయటకు నడుచుకుంటూ వస్తున్నా. ఉన్నట్టుండి నాకు ఏమీ వినిపించడం లేదని అనిపించింది. ధైర్యాన్ని కూడదీసుకుని కొన్ని వారాలు గడిపా. ఇప్పుడు నా మౌనాన్ని వీడి జరిగినది ప్రతి ఒక్కరికీ చెప్పాలని ఈ పోస్ట్ చేస్తున్నా. నా స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ నేను ఎందుకు కనిపించడం లేదని అడుగుతున్నారు. నాకు వినిపించడం లేదని అనిపించిన తర్వాత వైద్యుల దగ్గరకు వెళ్లాను. అరుదైన న్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్ అని చెప్పారు. నాకు దానిపై అవగాహన లేదు. లౌడ్ మ్యూజిక్ వినడం, ఎక్కువ సేపు హెడ్ ఫోన్ వాడటం వల్ల నేను అరుదైన వ్యాధి బారిన పడ్డాను. మీ అందరి ప్రేమ, అభిమానంతో మళ్లీ మునుపటి జీవితానికి మళ్లీ తిరిగి వస్తానని ఆశిస్తున్నాను. ఈ కష్టకాలంలో నాకు అందరి మద్దతు కావాలి'' అని అల్కా యాగ్నిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
View this post on Instagram
అల్కా యాగ్నిక్ త్వరగా కోలుకోవాలని మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆవిడ పోస్టును గాయని చిన్మయి షేర్ చేశారు. సోనూ నిగమ్, పూనమ్ థిల్లాన్, ఆకృతి కక్కర్ తదితరులు రాణి తరహాలో ఆడపులిలా పోరాడి వస్తారని తెలిపారు.
ఇప్పుడు అల్కా యాగ్నిక్ వయసు 58 సంవత్సరాలు. ఈ ఏడాది విడుదలైన 'క్రూ', 'అమర్ సింగ్ చమ్కీలా' సినిమాల్లో ఆవిడ పాటలు పాడారు. 1980ల నుంచి ఇప్పటి వరకు ఆవిడ పాటలు పాడుతున్నారు. ఎన్నో హిట్ సాంగ్స్ వెనుక ఆవిడ స్వరం ఉంది.
Also Read: హనీ రోజ్ కత్తి పట్టి మనుషుల్ని వేటాడితే... గ్లామర్ కాదు, Rachel Teaserలో హనీ మాస్
This is such a shock for a singer to go through.
— Chinmayi Sripaada (@Chinmayi) June 18, 2024
I wish her complete healing and a full recovery with all my heart. pic.twitter.com/AbEyAOqi5G