అన్వేషించండి

షారుఖ్ ఖాన్ తెలుగులో మాట్లాడటం చూశారా? - నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సెప్టెంబర్ 7న 'జవాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ గతంలో తెలుగులో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ ఈ ఏడాది 'పఠాన్' సినిమాతో సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వరుస అపజయాలతో డీలాపడ్డ షారుక్ కి 'పఠాన్' భారీ కం బ్యాక్ అందించింది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి, షారుక్ కెరియర్ లోని బిగ్గెస్ట్ గ్రాఫర్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే సక్సెస్ ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు ఈ హీరో. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సక్సెస్ తో ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. 'పఠాన్' వంటి భారీ సక్సెస్ తర్వాత షారుక్ నటిస్తున్న తాజా చిత్రం 'జవాన్'.

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ తో పాటు తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక తాజాగా చెన్నైలో సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇక ఇదిలా ఉంటే 'జవాన్' విడుదల సందర్భంగా షారుక్ కు సంబంధించిన పాత వార్తలు ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో షారుక్ తెలుగులో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆయన నటించిన 'జీరో' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో షారుక్ మాట్లాడిన వీడియో ఇది.

2018లో 'జీరో' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు షారుక్ ఖాన్. ఈ ప్రెస్ మీట్ లో హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ షారుక్‌ని ఓ ప్రశ్న అడిగారు. ఆ సమయంలో హైదరాబాద్ స్లాంగ్ లో మాట్లాడిన ఆయన, తర్వాత బాగున్నారా? అని విలేకరి అడగగా.. బాగున్నాను అని తెలుగులో బదులిచ్చాడు. అలాగే 'నా పేరు షారుక్ ఖాన్' అంటూ తెలుగులో మాట్లాడి అక్కడున్న అందరినీ ఆకట్టుకున్నాడు. షారుక్ అలా వచ్చి రాని తెలుగులో మాట్లాడటంతో ప్రెస్ మీట్ లో పాల్గొన్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు. 2018లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు మళ్లీ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan Fanpage (@its.all.about.my.love.srk___)

ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ‘‘షారుక్ తెలుగులో భలే మాట్లాడుతున్నాడు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షారుక్ ఖాన్‌కు హైదరాబాద్‌తో ఇంతకుముందే మంచి అనుబంధం ఉంది. హైదరాబాదులోని టోలిచౌకిలో షారుక్ నాలుగేళ్లు ఉన్నారట. అంతేకాదు చిన్నప్పుడు షారుక్ ఎక్కువగా హైదరాబాదులో వారి అమ్మమ్మ ఇంట్లోనే ఉండేవారట. షారుక్ అమ్మమ్మకు మగ పిల్లలు లేకపోవడంతో ఆమె షారుక్‌ను దత్తత తీసుకున్నారట. అలా షారుక్‌కి హైదరాబాద్‌తో ఎంతో మంచి అనుబంధం ఉంది.

ఇక షారుక్ ఖాన్‌కి మన తెలుగులోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా అభిమానించే ఇండియన్ యాక్టర్స్ లో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. మరి షారుక్ నటించిన 'జవాన్' హిందీ తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా మూవీ ప్రమోషన్స్ చేస్తారా? ఒకవేళ చేస్తే అందులో షారుక్ పాల్గొంటారా? లేదా అనేది చూడాలి.

Also Read : 'సలార్' కాదు - ఆ రోజు ఎన్టీఆర్ బావమరిది నితిన్ నటించిన 'మ్యాడ్'!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bellamkonda Sai Sreenivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - ఎంగేజ్మెంట్, మ్యారేజ్ వెన్యూ డీటెయిల్స్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - ఎంగేజ్మెంట్, మ్యారేజ్ వెన్యూ డీటెయిల్స్
Rajasekhar: తాత అని ఎవ్వరినీ పిలవనివ్వను, పిలవరు కూడా - రాజశేఖర్
తాత అని ఎవ్వరినీ పిలవనివ్వను, పిలవరు కూడా - రాజశేఖర్
Biker Vs Rakasa: బైకర్ vs రాకాస... బాక్సాఫీస్ దగ్గర కళకళ, రెండింటికీ ఆదరణ?
బైకర్ vs రాకాస... బాక్సాఫీస్ దగ్గర కళకళ, రెండింటికీ ఆదరణ?
Rakasa OTT : ఓ వైపు బైకర్... మరోవైపు రాకాస - ఒకే ఓటీటీలోకి రెండు మూవీస్... ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓ వైపు బైకర్... మరోవైపు రాకాస - ఒకే ఓటీటీలోకి రెండు మూవీస్... ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh NTR Vaidya Seva Scheme: ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
Amaravati Pin code: అమరావతికి కొత్త పిన్ కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
అమరావతికి త్వరలోనే ఆరు అంకెల కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
Gen-Z Vastu: Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
Donald Trump: అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
Bellamkonda Sai Sreenivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - ఎంగేజ్మెంట్, మ్యారేజ్ వెన్యూ డీటెయిల్స్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - ఎంగేజ్మెంట్, మ్యారేజ్ వెన్యూ డీటెయిల్స్
Rajasekhar: తాత అని ఎవ్వరినీ పిలవనివ్వను, పిలవరు కూడా - రాజశేఖర్
తాత అని ఎవ్వరినీ పిలవనివ్వను, పిలవరు కూడా - రాజశేఖర్
Tamil Nadu Assembly Elections : విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
Embed widget