Akshaye Khanna : శుక్రాచార్యుడిగా ధురంధర్ విలన్ - 'మహాకాళి' సెట్ నుంచి క్రేజీ స్టిల్
Mahakali Movie : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తాజాగా ఎక్సైటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా బర్త్ డే సందర్భంగా స్టిల్ రిలీజ్ చేశారు.

Akshaye Khanna's Telugu Movie Mahakali Movie Shooting Update : బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్'లో విలన్ రెహమాన్ డకైత్‌గా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా. ఆయన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ తెలుగు మూవీ 'మహాకాళి'లో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్షయ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
శుక్రాచార్యుడిగా...
మహాకాళి సినిమాలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అక్షయ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోగా... బర్త్ డే విషెష్ చెప్పిన ప్రశాంత్ వర్మ సెట్ నుంచి స్టిల్ రిలీజ్ చేశారు. 'అక్షయ్ సార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
నిజమైన టాలెంట్‌కు ఆర్భాటం అవసరం లేదని నిరూపించిన ఓ నిజమైన నటుడు. ఆయన సహజమైన నటన, హుందాతనం ఎల్లప్పుడూ స్పెషల్‌గా నిలుస్తాయి. మీతో కలిసి వర్క్ చేయడం నిజంగా ఓ గొప్ప గౌరవం. మనం కలిసి సృష్టించినదాన్ని ప్రపంచానికి చూపించడానికి వెయిట్ చేయలేకపోతున్నా.' అంటూ రాసుకొచ్చారు.
View this post on Instagram
Also Read : మెగాస్టార్ బాబీ మూవీ షూటింగ్‌కు రెడీ - ఫస్ట్ షాట్‌కు ముహూర్తం ఎప్పుడంటే?
ఈ మూవీకి ప్రశాంత్ వర్మ షో రన్నర్‌గా వ్యవహరిస్తుండగా... పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 100 రోజు షెడ్యూల్ పూర్తి కాగా... చివరిగా 40 రోజుల షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ... సినిమాటిక్ యూనివర్స్ (PVCU) అనౌన్స్ చేశారు. మహాకాళి ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ సూపర్ హీరో ప్రాజెక్ట్ కాగా... భూమి శెట్టి టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. మహాకాళిగా ఉగ్రరూపంతో ఆమె ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌరాణిక చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ నిలుస్తోంది.
భారీ బడ్జెట్
ఈ విజువల్ వండర్‌ను ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా... ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారు. మల్టీ స్టూడియోస్‌లో వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
మహాకాళి నటీనటులు : భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా
మహాకాళి టెక్నికల్ టీం - షో రన్నర్ : ప్రశాంత్ వర్మ, బ్యానర్ : RKD స్టూడియోస్, నిర్మాత : రివాజ్ రమేష్ దుగ్గల్, దర్శకత్వం : పూజ అపర్ణ కొల్లూరు, సంగీతం : స్మరణ్ సాయి, డివోపీ : సురేష్ రగతు, ప్రొడక్షన్ డిజైనర్ : శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వెంకట్ కుమార్ జెట్టి,
కాస్ట్యూమ్ డిజైనర్ : శిల్పా GNS, పబ్లిసిటీ: అనంత్ కంచెర్ల.
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు























