'యానిమల్' నుండి విలన్ లుక్ రివీల్ - పోస్టర్ తోనే భయపెట్టిన బాబీ డియోల్!
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న 'యానిమల్' చిత్రం నుంచి విలన్ గా నటిస్తున్న బాబీ డియోల్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్.
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్, స్టార్ రణబీర్ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'యానిమల్'(Animal). ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఓకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో దర్శకుడిగా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు సందీప్ వంగ. రాంగోపాల్ వర్మ తర్వాత మొదటి సినిమాతో ఇండస్ట్రీలో ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే 'అర్జున్ రెడ్డి'తో విజయ్ దేవరకొండని స్టార్ హీరోని చేశాడు. అదే సినిమాని షాహిద్ కపూర్ తో హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో సినిమా తీసే అవకాశాన్ని అందుకున్నాడు.
హిందీలో ఈ డైరెక్టర్ తీసిన అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్' ను చూసిన కొంతమంది బాలీవుడ్ విశ్లేషకులు సినిమా చాలా వైలెంట్ గా ఉందంటూ కామెంట్స్ కూడా చేశారు. ఈ కామెంట్స్ సందీప్ వరకు వెళ్లడంతో 'కబీర్ సింగ్' ని వైలెంట్ ఫిలిం అంటున్నారు. అసలు వైలెన్స్ అంటే ఏంటో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తానని చెబుతూ 'యానిమల్' ని మోస్ట్ వైలెంట్ ఫిలింగా తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో రణబీర్ ని ఊర మాస్ లెవెల్లో చూపిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మరింత క్యూరియాసిటీ పెంచేసాయి. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ సరికొత్త పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు.
Animal ka Enemy :-)#Animal #AnimalTeaserOn28thSept#AnimalTheFilm #AnimalOn1stDec@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPictures #KrishanKumar @TSeries @VangaPictures pic.twitter.com/yfDm7XrthY
— Sandeep Reddy Vanga (@imvangasandeep) September 26, 2023
ఇప్పటికే అనిల్ కపూర్, రష్మికల పోస్టర్స్ విడుదల చేసిన సందీప్, లేటెస్ట్ గా 'యానిమల్' విలన్ బాబీ డియోల్ పోస్టర్ ని విడుదల చేశాడు. 'యానిమల్ కా విలన్' అనే క్యాప్షన్ తో పోస్టర్ విడుదల చేయగా, ఈ పోస్టర్లో బాబి డియల్ బ్లడ్ షేడ్ లో మోస్ట్ వైలెంట్ మెన్ గా కనిపిస్తున్నాడు. 'యానిమల్' కి విలన్ అంటే 'యానిమల్' కన్నా భయంకరంగా ఉండాలనుకున్నాడో తెలియదు కానీ మునుపెన్నడూ కనిపించని విధంగా ఈ పోస్టర్లో బాబీ డియోల్ చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. పోస్టర్ని బట్టి సినిమాలో రణబీర్ - బాబీ డియోల్ మధ్య బీకర పోరు ఉండబోతున్నట్లు స్పష్టమవుతుంది. ప్రస్తుతం నెట్టింట ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది.
పోస్టర్స్ ఈ రేంజ్ లో ఉంటే టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందోనని 'యానిమల్' టీజర్ కోసం ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 28న టీజర్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. మరి టీజర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక సినిమాలో రణబీర్ సరసన రష్మిక మందన్న గీతాంజలి అనే పాత్రలో కనిపించబోతోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఇందులో రణబీర్ తండ్రిగా నటిస్తున్నారు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా హిందీ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Also Read : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త సినిమా - డైరెక్టర్ ఎవరంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial