Bandla Ganesh: 'కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే' - బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్.. ఆయనకు కౌంటర్ ఇచ్చారా..?
Bandla Ganesh Counter: సినీ నిర్మాత బండ్ల గణేష్ తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. అయితే, ఇది నటుడు ప్రకాష్‌రాజ్‌కు కౌంటర్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Bandla Ganesh Interesting Tweet On Humanity: సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) తాజా ట్వీట్ నెట్టింట చర్చకు దారి తీసింది. కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమేనని ఆయన అన్నారు. 'కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే. ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి.' అని ట్వీట్ చేశారు.
ప్రకాష్‌రాజ్‌కు కౌంటర్ అంటూ కామెంట్స్
అయితే, బండ్ల గణేష్ ఇండైరెక్ట్‌గా నటుడు ప్రకాష్‌రాజ్‌కు (Prakash Raj) కౌంటర్ ఇచ్చారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తాజాగా.. జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కల్యాణ్.. తమిళులు, హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలను ప్రకాష్‌రాజ్ తప్పుబట్టారు. 'దేశంలో అన్ని భాషలను గౌరవించాలి. త్రిభాషా వాదన సరికాదు. తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారు. హిందీ మాకొద్దు అనే తమిళనాడు నాయకులు వారి తమిళ సినిమాలను హిందీ డబ్ చేయడం మానుకోండి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పని వాళ్లను తీసుకురావడం మానేయండి. హిందీ రాష్ట్రాల నుంచి డబ్బులు కావాలి. వారి భాష మాత్రం మాకొద్దంటే ఎలా.?.' అంటూ కామెంట్ చేశారు.
“కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే,
— BANDLA GANESH. (@ganeshbandla) March 15, 2025
ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే.”
ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి….!
ప్రకాష్‌రాజ్ కౌంటర్
పవన్ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా ప్రకాష్‌రాజ్ కౌంటర్ ఇచ్చారు. 'మీ హిందీ భాషను మా మీద రుద్దకండి', అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు.. స్వాభిమానంతో మా మాతృభాష, మా తల్లిని కాపాడుకోవడం, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి.. ప్లీజ్' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపైనే ఇండైరెక్ట్‌గా ప్రకాష్‌రాజ్‌కు బండ్ల గణేష్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
బండ్ల గణేష్ ఆ ట్వీట్‌ను ఉద్దేశిస్తూ..
ఈ సందర్భంగా నెటిజన్లు పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. 'మా' ఎన్నికల సమయంలో అధ్యక్ష పదవి కోసం ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు పోటీ చేయగా.. ఆ టైంలో పవన్ విష్ణుకు కాకుండా ప్రకాష్‌రాజ్‌కు మద్దతు ఇచ్చారు. అలాంటి పవన్‌పై ఇప్పుడు ప్రకాష్‌రాజ్ సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృతజ్ఞతగా ఉండాలంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.






















