Balakrishna: విశ్వక్ సేన్ మూవీలో బాలయ్య? - క్రేజీ ఎపిసోడ్ కోసం భారీగా ప్లాన్... రోల్ ఏంటో తెలుసా!
ENE Repeat: 2018లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీకి సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Balakrishna Key Role In Vishwak Sen's ENE REPEAT Movie: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఈ నగరానికి ఏమైంది?' మూవీకి ఇటీవలే సీక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్, వెంకటేశ్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2018లో విడుదలై బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.
స్పెషల్ రోల్‌లో గాడ్ ఆఫ్ మాసెస్
'ఈ నగరానికి ఏమైంది' మూవీకి సీక్వెల్‌గా 'ENE REPEAT' పేరుతో సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు ఇటీవలే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో క్రేజీ బజ్ వైరల్ అవుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఈ సినిమాలో స్పెషల్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన ఓ ఇంట్రెస్టింగ్ క్యామియోలో కనిపించే ఛాన్స్ ఉందట. విశ్వక్‌తో కలిసి ఓ క్రేజీ ఎపిసోడ్ కోసం కొన్ని నిమిషాల పాటు ఆయన కనిపించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్లాన్ అదుర్స్...
విశ్వక్ సేన్ బాలకృష్ణకు వీరాభిమాని. ఆయనంటే తనకు ఎంత అభిమానమో స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు విశ్వక్. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ సెట్స్‌కు వెళ్లి యంగ్ హీరోకు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని... మూవీలో బాలయ్య గెస్ట్ రోల్‌లో కనిపించడం ఖాయమని నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే థియేటర్స్ బ్లాస్టే అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఇండస్ట్రీలోకి మోహన్ లాల్ కుమార్తె - ఫస్ట్ మూవీతోనే ఫుల్ హైప్... ఛాలెంజెస్ ఎదుర్కొని మరీ
'ఈ నగరానికి ఏమైంది' మూవీ ఓటీటీలోనూ అదరగొట్టింది. ఇటీవలే రీ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇదే జోష్‌తో మేకర్స్ సీక్వెల్ అనౌన్స్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.సురేష్ బాబు సినిమాను నిర్మించారు. 'ఏలిన నాటి శని వదిలిపోయింది. కన్యా రాశి టైం వచ్చింది' అంటూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. మరోసారి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ అందించబోతున్నట్లు వీడియో బట్టి అర్థమవుతోంది.
డిఫరెంట్‌గా...
'ఈNఈ' అంటూ ఇంగ్లిష్ తెలుగు మిక్స్ చేసి లోగో క్రియేట్ చేయడం భారీ హైప్ క్రియేట్ అవుతోంది. గాలిలో బ్రీఫ్ కేస్ ఎగరేయగా బీర్ బాటిళ్లు, బట్టలు, ఫ్లైట్ టికెట్ కలిపి ఓ అడ్వెంచర్ టూర్‌లా మూవీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నలుగురు మధ్య తరగతి యువకుల కథను 'ఈ నగరానికి ఏమైంది'లో చూపించారు. ఓ పార్టీలో ఫుల్‌గా తాగి వీరు అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్తారు. అసలు అక్కడ ఏం జరిగింది? వీరికి ఎదురైన పరిణామాలేంటి? అనేది చూపించగా... సీక్వెల్‌లో ఎక్కడకు ప్లాన్ చేశారోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. హిట్ కాంబోతో 'ENE REPEAT' తెరకెక్కిస్తుండగా... సీక్వెల్ హిట్ ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.






















