Akhanda 2: బాలకృష్ణ 'అఖండ 2'పై కీలక అప్ డేట్ - సినిమాకే హైలెట్‌గా యాక్షన్ సీన్స్, ఆ సన్నివేశం కోసం భారీ సెట్?
Balakrishna Akhanda 2: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'అఖండ 2'. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్‌పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Balakrishna Akhanda 2 Movie Shooting Update: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (BalaKrishna), బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'అఖండ 2' (Akhanda 2). బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన 'అఖండ' మూవీకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం అటు బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆ సీన్ కోసం భారీ సెట్
ఈ సినిమాపై కానీ, షూటింగ్ కోసం కానీ ఏ అప్ డేట్ వచ్చినా క్షణాల్లోనే ట్రెండింగ్ అవుతోంది. తాజాగా.. ఈ సినిమా షూటింగ్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. మూవీలో ఇంటర్వెల్ సీక్వెల్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఈ సెట్‌లో దాదాపు 2 వారాల పాటు యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఈ ఫైట్స్ చిత్రీకరిస్తారని సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని.. ఇంటర్వెల్ సీక్వెన్స్‌తో గూస్ బంప్స్ ఖాయమని ఫిల్మ్ నగర్ టాక్ వినిపిస్తోంది.
హిమాలయాల్లో షూటింగ్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాలయాల్లో జరుగుతోంది. 'అఖండ'లో (Akhanda) బాలయ్య అఘోర పాత్రలో కనిపించగా.. సీక్వెల్‌లోనూ ఆ రోల్ కంటిన్యూ కానున్నట్లు తెలుస్తోంది. ఆయనపై కీలక సీన్స్‌ను హిమాలయాల్లోని కొన్ని ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. త్వరగా ఈ షూటింగ్ పూర్తి చేసి ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం వేసిన భారీ సెట్లో కీలక ఫైట్స్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
Also Read: కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
'అఖండ'లో బాలకృష్ణ డబుల్ రోల్‌లో కనిపించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. సీక్వెల్‌లో మాత్రం హీరోయిన్‌గా సంయుక్త నటిస్తున్నారు. ఈ సినిమాలో విలన్‌గా యంగ్ హీరో ఆది పినిశెట్టిని నటిస్తున్నారు. అల్లు అర్జున్ 'సరైనోడు' సినిమాలో విలన్‌గా నటించి మెప్పించారు ఆది పినిశెట్టి. ఇప్పుడు 'అఖండ 2'లోనూ విలన్‌గా ఆయన్ను బోయపాటి తీసుకున్నారు. ఇప్పటికే ఆయనపై పలు సీన్స్ షూటింగ్ పూర్తి చేశారు.
దసరా కానుకగా..
ఈ ఏడాది దసరా సందర్భంగా 'అఖండ 2 - తాండవం' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. సినిమాను బాలకృష్ణ రెండో కుమార్తె ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
అయితే, బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటేనే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి క్రేజీ కాంబోపై ఆడియన్స్‌లో ఎల్లప్పుడూ భారీ అంచనాలే ఉంటాయి. 'సింహా' మూవీ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 2014లో వచ్చిన 'లెజెండ్' సైతం భారీ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో వచ్చిన మూడో సినిమా 'అఖండ' సైతం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'అఖండ 2'పై భారీ అంచనాలే ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

