Avika Gor: కాపాడాల్సిన బాడీగార్డే.. లైంగికంగా వేధిస్తే? నటి అవికా గోర్‌కు చేదు అనుభవం, షాకవుతున్న ఫ్యాన్స్
Avika Gor: అవికాగోర్..చిన్నారి పెళ్లికూతురిగా అందరికీ పరిచయం. అయితే, ఆమె లైంగిక వేధింపులకు గురయ్యారట.ఎవరో కాదు తన బాడీగార్డ్ నుంచే అలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాను అని చెప్పారు అవికా గోర్.
Avika Gor Recalls Being Sexually Harassed: ఇండస్ట్రీలో హీరోయిన్లు, ఆర్టిస్టులు ఎంతోమంది లైంగిక వేధింపులకు గురయ్యామని చెప్తూ ఉంటారు. నిజానికి వాళ్లకు అలాంటి ఇబ్బందులు రావొద్దని బాడీగార్డ్ లను పెట్టుకుంటారు. కానీ, తనను రక్షించాల్సిన బాడీగార్డే తనతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పింది ఒక హీరోయిన్. ఆమె అవికా గోర్. అవికా గోర్.. ‘బాలికా వధూ’గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. చిన్నారి పెళ్లికూతురిగా తెలుగు వాళ్లకు తెలుసు. అయితే, తను లైంగిక వేధింపులకు గురయ్యానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అప్పుడు కొట్టే ధైర్యం లేదని, ఇప్పుడు ధైర్యం తెచ్చుకుంటున్నాను అంటూ చెప్పింది. అసలు ఏం జరిగిందంటే?
తప్పుగా ప్రవర్తించాడు. ..
దుబాయ్ లో ఒక ఈవెంట్ కి వెళ్లినప్పుడు తను అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది అవికా గోర్. ఎవరో తనను వెనుక నుంచి టచ్ చేసినట్లు అనిపించిందని, వెనక్కి తిరిగి చూస్తే తన సెక్యూరిటీ గార్డ్ ఒక్కడే ఉన్నాడని చెప్పింది. అలా ఒకసారి కాదు రెండో సారి కూడా చేయాలని చూశాడని తెలిపింది. కానీ, వెంటనే చేయి పట్టుకుని ఆపేశానని చెప్పింది.
"నాకు ఈ సంఘటన చాలా గుర్తింది. ఎవరో నన్ను వెనుక నుంచి టచ్ చేశారు. వెంటనే నేను వెనక్కి తిరిగి చూశాను. అప్పుడునా సెక్యూరిటీ గార్డ్ ఒక్కడే అక్కడ ఉన్నాడు. నేను తర్వాత స్టేజ్ పైకి వెళ్తున్నప్పుడు కూడా ఎవరో నన్ను వెనుక నుంచి టచ్ చేయాలని చూశారు. నేను వెనక్కి తిరిగి వెంటనే అప్పుడు కూడా నేను నా సెక్యూరిటీని మాత్రమే చూశాను. రెండో సారి కూడా అలానే జరగడం గమనించి వెంటనే నా చేతిని అడ్డుపెట్టి ఆపాను. వెంటనే అతని వైపు కోపంగా చూస్తే.. ఆ వ్యక్తి నాకు సారీ చెప్పాడు. నేనేం చేయలేకపోయాను. అలా వదిలేశాను. నిజానికి వాళ్లకు తెలీదు. వాళ్లు చేసే ఆ పని అవతలి వాళ్లను ఎంతలా ఇబ్బంది పెడుతుందో. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అలాంటి వాళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. నిజానికి అప్పుడు ధైర్యం ఉండి ఉంటే చాలామందిని వెనక్కి తిరిగి కొట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ధైర్యం ఉందని అనుకుంటున్నాను. కానీ, అలాంటి పరిస్థితులు రావొద్దనే కోరుకుంటున్నాను" అంటూ తన ఎదుర్కొన్న పరిస్థితులు గురించి చెప్పింది అవికా.
'బాలికా వధూ' సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అవికా గోర్. ఆ తర్వాత ఆ సీరియల్ తెలుగులో 'చిన్నారి పెళ్లి కూతురు' పేరుతో డబ్ చేశారు. అయితే, తన సినిమా కెరీర్ ని మాత్రం తెలుగు నుంచే ప్రారంభించింది అవికా. 2013లో ఆమె 'ఉయ్యాల జంపాల' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ఆమె.. బాలీవుడ్ లో 'పాఠశాల', 'తేజ్', 'కహానీ రబీర్ బంద్ కి', '1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్' తదితర సినిమాలు చేసింది. అవికా గోర్ నటించిన 'బ్లడీ ఇష్క్' సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
Also Read: రష్మిక మాజీ ప్రియుడి గుండె మళ్లీ పగిలిందట - తగ్గేదేలే అంటూ బన్నీ బాటపట్టిన రక్షిత్ శెట్టి