Avatar 3 First Look: అవతార్ 3 ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారోచ్... ట్రైలర్ రిలీజ్ అప్డేట్ కూడా!
Avatar 3 Trailer Release Date: వెండితెరపై జేమ్స్ కామెరూన్ ఆవిష్కరించిన అద్భుత దృశ్య కావ్యం 'అవతార్'. ఆ ఫ్రాంచైజీలో మూడో సినిమా 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ లుక్ తో పాటు ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.

వెండితెరపై హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆవిష్కరించిన అద్భుత దృశ్య కావ్యం 'అవతార్'. ఇప్పటికి ఆ ఫ్రాంచైజీలో రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండిటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు 'అవతార్' ఫ్రాంచైజీలో మూడో సినిమా వస్తోంది. అదే 'అవతార్: ఫైర్ అండ్ యాష్' (Avatar Fire And Ash). ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.
'అవతార్ 3' ఫస్ట్ లుక్ చూశారా?
Avatar 3 First Look: ''అవతార్: ఫైర్ అండ్ యాష్'లో వరంగ్'' అంటూ ఈ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. పండోరా గ్రహంలో పలు పాత్రలు ప్రేక్షకులకు తెలుసు. జేక్, నేయిత్రి, కిరి సహా భూమి మీద నుంచి అక్కడికి వెళ్లిన కల్నల్ వంటి వ్యక్తులు తెలుసు. ఇప్పుడు కొత్త పాత్రను పరిచయం చేశారు జేమ్స్ కామెరూన్.
'ఫెంటాస్టిక్ ఫోర్'తో ట్రైలర్ రిలీజ్!
'అవతార్ 3' ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు ట్రైలర్ రిలీజ్ గురించి కూడా చిత్ర బృందం అప్డేట్ ఇచ్చింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్'తో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Also Read: పవన్ ఓ లెజెండ్... వీరమల్లు విడుదలకు ముందు క్రిష్ ట్వీట్... వైరల్ స్టేట్మెంట్ చూశారా?
View this post on Instagram
ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25న (శుక్రవారం) 'ఫెంటాస్టిక్ ఫోర్' విడుదల అవుతోంది. ఆ సినిమాకు 'అవతార్ 3' ట్రైలర్ ఎటాచ్ చేశారు. థియేటర్లలో ప్లే అవుతుంది అన్నమాట.
థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
Avatar 3 Release Date: ఈ ఏడాది డిసెంబర్ 19న 'అవతార్ 3' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. లాస్ట్ రెండు పార్ట్స్ ఇండియాలో భారీ వసూళ్లు సాధించడంతో ఈ సినిమా మీద భారతీయ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలలో కూడా అంచనాలు నెలకొన్నాయి.





















