Image Source: Avatar Instagram

'అవతార్' అంటే ఓ ఎమోషనల్ ఫిల్మ్, విజువల్ వండర్! 13 ఏళ్ళ తర్వాత వచ్చిన సీక్వెల్ 'అవతార్ 2' ఎలా ఉంది?

Image Source: Avatar Instagram

కథ : పండోరా గ్రహంపై పిల్లలు, భార్యతో కలిసి జేక్ సల్లీ హ్యాపీగా ఉంటారు. అతడూ నావి జాతిలో కలిసిపోతాడు. 

Image Source: Avatar Instagram

నావి జాతి మనిషిగా మారిన కల్నల్, పండోరా గ్రహం మీదకు వచ్చి జేక్ సల్లీ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు.

Image Source: Avatar Instagram

ఫ్యామిలీ రక్షణకు పండోరా గ్రహం మీద సముద్ర తీరంలో తిమింగలాలతో జీవించే రీఫ్ తెగ నీడలో జేక్ ఫ్యామిలీ ఉంటుంది. 

Image Source: Avatar Instagram

జేక్‌ను చంపాలనే కల్నల్ లక్ష్యం నెరవేరిందా? అతడికి సముద్రంలో టుల్‌కున్స్ ఎలా సాయం చేశాయి? అనేది కథ.

Image Source: Avatar Instagram

సినిమా ఎలా ఉంది? : విజువల్స్ పరంగా 'అవతార్ 2' అద్భుతం. చూస్తే సినిమాను త్రీడీలో చూడాలి. 

Image Source: Avatar Instagram

టెక్నికల్ పరంగా సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంది. 'అవతార్ 2'లో అండర్ వాటర్ సీన్స్ అద్భుతమని చెప్పాలి. 

Image Source: Avatar Instagram

సినిమా మొదలైన రెండు గంటలు చాలా నిదానంగా సాగుతుంది. చివరి గంటలో జేమ్స్ కామెరూన్ అద్భుతం సృష్టించారు.

Image Source: Avatar Instagram

పండోరా గ్రహం మనకు కొత్త కనుక 'అవతార్'ను కళ్ళప్పగించి చూశాం. తెలిసిన ప్రపంచంలో రొటీన్ కథ కావడంతో నిరాశ పడతాం. 

Image Source: Avatar Instagram

విజువల్స్, యాక్షన్ విషయంలో జేమ్స్ కామెరూన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. రివేంజ్ డ్రామాగా 'అవతార్ 2'ను ఎండ్ చేశారు. 

Image Source: Avatar Instagram

కేట్ విన్స్‌లెట్ ఫ్యాన్స్‌కూ నిరాశే. స్క్రీన్ మీద ఆమె కనపడలేదు. మోషన్ క్యాప్చర్ కావడంలో గుర్తు పట్టడం కష్టం.