బాలాదిత్య బహుముఖ ప్రజ్ఞాశాలి - నటుడు, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్. చదువుల్లో కూడా మంచి ప్రతిభావంతుడు.

బాలాదిత్య 'లిటిల్ సోల్జర్స్', 'ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం', 'అన్న' సినిమాల్లో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

చిన్నతనంలోనే బాలాఆదిత్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని రెండు 'నంది' అవార్డులను సొంతం చేసుకున్నాడు.

ఈటీవిలో ప్రసారమైన 'ఛాంపియన్స్' క్విజ్ షోకు బాలాదిత్య యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.

బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాదు 2003లో 'చంటిగాడు' సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

బాలాదిత్య సినిమాల్లోనే కాదు, తెలుగులో 'శాంభవి', తమిళంలో 'రాసాతి' అనే సీరియల్స్ లో కనిపించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

బాలాదిత్య బిగ్ బాస్ హౌస్‌లో బాగా ఆడినప్పటికీ, లక్ కలిసిరాలేదు. దీంతో త్వరగానే ఎలిమినేట్ అయ్యాడు.

తాజాగా బాలాదిత్య తన కూతురికి నామకరణం చేశాడు. యజ్ఞ విదాత్రి అని పేరు పెట్టాడు.

Image Credit: Actor Balaaditya/Instagram