పారీస్‌లో చిరుతో సాంగ్ - కత్తితో బెదిరిస్తున్న శృతిహాసన్ అందాల తార శృతిహాసన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తెలుగులో పలు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తాజాగా చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య‘ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పాటల షూటింగ్ పారీస్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా శృతి ఇచ్చిన ఫన్నీ ఫోజులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్పూన్ తో ఐస్ క్రీమ్ తింటూ సరదా సరదాగా గడిపింది. మిత్రులతో కలిసి ఫన్నీ పనులు చేస్తూ ఆకట్టుకుంది. Photos & Videos Credit: Shruti Haasan/Instagram