మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ లిస్టులో సత్తా చాటిన సౌత్ సినిమాలు

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది సౌత్ సినిమాల హవా కొనసాగింది.

IMDb 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ లిస్టులో ‘RRR’ టాప్ ప్లేస్ దక్కించుకుంది.

వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘కాశ్మీర్ పైల్స్’ రెండో స్థానంలో నిలిచింది.

యశ్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘KGF-2‘ మూడో స్థానం దక్కించుకుంది.

కమల్ హాసన్ ‘విక్రమ్‘ మూవీ 4వ స్థానం సంపాదించుకుంది.

రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన ‘కాంతార‘ 5వ ప్లేస్ లో నిలిచింది.

మాధవన్ నటించి, తెరకెక్కించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ 6వ స్థానం పొందింది.

సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ‘మేజర్‘ 7వ స్థానంలో నిలిచింది.

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రేమకథా చిత్రం ‘సీతా రామం’ 8వ స్థానం పొందింది.

కల్కి నవల ఆధారంగా మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్-1’ 9వ స్థానం దక్కించుకుంది.

రక్షిత్ శెట్టి, సంగీత నటించిన కన్నడ చిత్రం ’777 చార్లీ’ 10వ స్థానంతో సరిపెట్టుకుంది.
(Photos Credit: twitter)