Ashwini Dutt: 'కల్కి 2898 AD' టికెట్ల రేట్ల పెంపు - అసలు విషయం చెప్పిన నిర్మాత అశ్వనీ దత్
Ashwini Dutt About Tiket Rates Hike: 'కల్కి 2898 AD' మూవీ టికెట్స్ రేట్స్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉందంటూ కొద్ది రోజులు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌పై స్వయంగా నిర్మాత స్పందించారు.
Ashwini Dutt Clarifies Kalki Ticket Rates Hike: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'కల్కి 2898 AD'. జూన్ 27న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఇక బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. మూవీ విడుదలై రెండో వారం కూడా గడిచింది. ఇంకా కల్కి అదే జోరుతో కలెక్షన్స్ చేస్తుంది. అయితే ఇప్పటికే ‘కల్కి 2898 ఏడీ’ మూవీ టికెట్స్ రేట్స్ భారీగా పెంచిన సంగతి తెలిసిందే.
కానీ, ‘కల్కి 2898 ఏడీ’' మూవీ టికెట్స్ రేట్స్ మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా అశ్వనీ దత్ ఓ ఇంటర్య్వూలో టికెట్ రేట్స్‌పై ప్రస్తావించారు. అప్పటి నుంచి ఈ రూమర్స్ గుప్పుమన్నాయి. దీంతో ఆడియన్స్ అంత ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా టికెట్స్ రేట్ పెరగడమేంటని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ స్వయంగా 'కల్కి 2898 AD' నిర్మాత అశ్వనీ దత్ స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ పోస్ట్‌లో ట్వీట్ చేశారు.
"ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్య్కూలో టికెట్ రేట్ల పెంపుదల గురించి అనవసరపు అపోహాలు వస్తున్నాయి. "సినిమా టికెట్ల రేట్ల పెంపుదల కోసం ప్రతిసారీ ప్రభుత్వం చూట్టూ తిరగడం అవసరం లేకుండా శాశ్వతమైన ప్రతిపాదన చేయాలన్నది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిలాష. నిర్మాతలంతా కూర్చుని కూలంకుషంగా చర్చించుకోని,సినిమా బడ్జెట్‌ను బట్టి టికెట్ రేట్లు ఎంతవరకు పెంచుకోవొచ్చు నిర్ణయించమన్నారు. అది వారమా? పది రోజులా? అనే విషయంపై నిర్మాతలంతా ఒక నిర్ణయానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో తాను స్వయంగా చర్చిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అన్ని వర్గాల వారికి, ప్రేక్షకులకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకొందామని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆయన నిర్మాతలందరికి అండగా ఉంటానని మాట ఇచ్చారు" అని ఆయన చెప్పుకొచ్చారు.
— Chalasani Aswini Dutt (@AshwiniDuttCh) July 5, 2024
దీంతో టికెట్ రేట్లపై వస్తున్న వార్తలకు తెరపడినట్లు అయ్యింది. ఇక ప్రస్తుతం నిర్మాత అశ్వనీ దత్, మూవీ టీం కల్కి విజయాన్ని ఆస్వాధింది. ఇక మూవీ సక్సెస్ సందర్భంగా నిర్మాత, డైరెక్టర్ నాగ్ అశ్విన్ వరుస ఇంటర్య్వూలో బిజీగా ఉన్నారు. మన పురాణ ఇతిహాసం మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ జోడించి అద్భుతం చేశాడు నాగ్ అశ్వీన్. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దాదాపు రూ. 600 కోట్ల వ్యయంతో 'కల్కి 2898 AD' చిత్రాన్ని రూపొదించారు. ఇక ఈ సినిమాలో నటించిన వారంత భారీ తారగణమే. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపికా పదుకొనె, రాజేంద్ర ప్రసాద్, నటి శోభన, దిశా పటానీ వంటి స్టార్స్ నటించారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్లు అతిథి పాత్రలో మెరిశారు.
Also Read: ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌లో శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు? అసలు విషయం చెప్పేసిన నాగ్ అశ్విన్