By: ABP Desam | Updated at : 28 May 2023 12:53 PM (IST)
Photo Credit: Ashish Vidyarthi/twitter
నార్త్ టు సౌత్ సినీ పరిశ్రమల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు అశిష్ విద్యార్థి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ తో పాటు పలు సినీ పరిశ్రమల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల వయస్సులో అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాకు మూడు ముళ్లు వేశారు. మే 25న తమ సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు కోర్టులో వివాహం చేసుకున్నారు.
తాజాగా తన రెండో పెళ్లి గురించి పలు విషయాలు వెల్లడించారు ఆశిష్ విద్యార్థి. అసలు తాను రెండో వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్పారు. తన మొదటి భార్య రాజోషి గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. ఆమెతో ఇప్పటికే విడాకులు తీసుకున్నట్లు వివరించారు. ఆశిష్ పెళ్లి తర్వాత పలు విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆశిష్ వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న రాజోషి, ఆయనకు దూరంగా ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, రూపాలిని తాను ఎలా కలిశాడో చెప్తూ ఆశిష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు.
“మనలో ప్రతి ఒక్కరూ వివిధ సామాజిక వర్గాల నుండి వచ్చారు. భిన్నమైన నమ్మకాలు, మతాలు ఉన్నాయి. అయితే, మనందరికీ ఉమ్మడిగా ఒక విషయం ఉంది. మనమందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. 22 ఏళ్ల క్రితం, నాకు పెళ్లయింది. అద్భుతంగా గడిచింది. కొంత కాలంగా మా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇద్దరి దారులు వేరని భావించాం. వాటిని విస్మరించి కలిసి ఉండాలి అనుకున్నాం. అందుకోసం కొంత ప్రయత్నం కూడా చేశాం. కానీ, కుదరలేదు. మేము కూర్చుని, స్నేహపూర్వకంగా వేర్వేరు మార్గాల్లో నడవడం గురించి ఆలోచించాం. చివరకు విడిపోవాలని నిర్ణయించుకున్నాం. అనుకున్నట్లుగానే విడిపోయాం” అని ఆశిష్ ఆ వీడియోలో చెప్పారు.
విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. “నేను ఎవరో ఒకరితో ప్రయాణం చేయాలనుకున్నాను. అలా అనుకుంటున్న నేను రూపాలి బారువాను కలిశాను. ఒక సంవత్సరం క్రితం కలుసుకున్నాం. ఒకరికొకరం కలిసి ఉండాలి అనుకున్నాం. మేము భార్యాభర్తలుగా జీవితాన్ని కొనసాగించాలి అనుకున్నాం. అందులో భాగంగానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. చివరకు ఒక్కటయ్యాం” అని వివరించారు. మలయాళీ సినిమా పరిశ్రమకు చెందిన ఆశిష్, రూపాలి బారువా కంటే ముందే నటి రాజోషి వివాహం చేసుకున్నారు. రాజోషి నటి, గాయని, థియేటర్ ఆర్టిస్ట్. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. దీంతో ఆశిష్ విద్యార్థి రెండో వివాహం చేసుకున్నారు.
An Update On My Life | Ashish Vidyarthihttps://t.co/EBbUUQvVT7#AshishVidyarthi pic.twitter.com/j3yqAJqSv1
— Ashish Vidyarthi (@AshishVid) May 26, 2023
ఇక ఆశిష్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో చివరిగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాలో కనిపించారు. ఆయన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో కూడా ఆశిష్ నటించారు. హిందీ సినిమా ‘ఖుఫియా’లో కూడా నటించారు. ఈ సినిమా డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. మొత్తం 11 భాషల్లో 200కు పైగా చిత్రాల్లో ఆశిష్ విద్యార్థి నటించారు.
Read Also: తెలుగు జాతికి ఘనకీర్తి తెచ్చిన మహనీయుడు, కారణజన్ముడు- ఎన్టీఆర్ ను స్మరించుకున్న సినీ ప్రముఖులు
Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>