News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

NTR 100th Birth Anniversary: తెలుగు జాతికి ఘనకీర్తి తెచ్చిన మహనీయుడు, కారణజన్ముడు- ఎన్టీఆర్ ను స్మరించుకున్న సినీ ప్రముఖులు

నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు నేలపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహనీయుడు ఎన్టీ రామారావు. ఆయన జయంతి సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు స్మరించుకున్నారు.

FOLLOW US: 
Share:

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా రంగానికి, తెలుగు రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ మహనీయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  

చిరకాలం మన మనసులలో మిగిలిపోతారు- చిరంజీవి

నూటికో కోటికో ఒక్కరు, వందేళ్లు కాదు, చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు  ఎన్టీఆర్ అని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. చరిత్ర వారి గురించి భావితరాలకు గర్వంగా చెప్తుందన్నారు. కారణ జన్ముడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగు జాతికి ఘన కీర్తి తీసుకొచ్చిన రామారావుతో అనుబంధం ఎప్పటికీ చిరస్మరణీయం అన్నారు.

తాతను గుర్తు చేసుకున్న జూ. ఎన్టీఆర్

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, ఆ మహనీయుడిని గుర్తు చేసుకున్నారు. “మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా“ అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

తెలుగు జాతికి గర్వం- కల్యాణ్ రామ్

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి కల్యాణ్ రామ్ ఆయనను స్మరించుకున్నారు. “మీరే మా దైవం, మీరే మా సర్వం, తెలుగు జాతికి మీరు గర్వం. జోహార్ NTR” అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  “నటుడిగా ఇప్పటికీ ఆయనంటే నాకు భయం. ఇప్పటికీ చాలా మంది నటీనటులకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘దాన వీర శూర కర్ణ’ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఆయన  ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం ఎప్పటికీ మర్చిపోలేం. నేటి సాంకేతికతలో మీ నటనకు సరితూగడం నిజంగా కష్టం.   అతడి నటనా నైపుణ్యంతో మిలియన్ల మందిని,  ఎన్నో తరాలను అలరించడానికి, అతడి సినిమాల ద్వారా శాశ్వతంగా  భూమ్మీద జీవించడానికి దేవతులు పంపింన మహనీయుడు ఆయన” అన్నారు మంచు విష్ణు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నటుడు సాయి ధరమ్ తేజ్ ఆయనను గుర్తు చేసుకున్నారు. “భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయక నటుడిగా, నాయకుడిగా చిరస్థాయిగా మిగిలిపోతారు. ఆ 'లెజెండ్'కి నివాళులు” అని ట్వీట్ చేశారు.

దర్శకుడు శ్రీను వైట్ల ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. గ్రేటెస్ట లెజెంట్ కు సెల్యూట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

ఎన్టీఆర్ చరిష్మా, ఆయన అందుకున్న విజయాలు తర తరాల నటులకు స్పూర్తిదాయకం అన్నారు దర్శకుడు బాబీ. 100వ జయంతి సందర్భంగా ఎన్టీ రామారావుకు ఆయన సెల్యూట్ చేశారు.  

Read Also: ఇంటికి వచ్చి మరీ క్షమాపణ చెప్పారు, ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే- విజయశాంతి

Published at : 28 May 2023 11:40 AM (IST) Tags: tollywood celebrities Jr NTR Nandamuri Kalyan Ram Baby Sai Dharam Tej Srinu Vaitla Manchu Vishnu NTR 100th Birth Anniversary Chiranjeevi Nandamuri Taraka Rama Rao

ఇవి కూడా చూడండి

Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి

Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి

Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!

Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?

Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్

Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?