Archana Shastry: ఆ హీరోకు రిప్లై ఇవ్వలేదని సినిమా నుంచి తీసేశారు, అవార్డ్ ఫంక్షన్‌లో అవమానం - అర్చన శాస్త్రి
Archana Shastry: ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో లల్లీ పాత్రలో నటించిన అర్చన శాస్త్రీని ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. తాజాగా టాలీవుడ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడింది.
Archana Shastry About Film Industry: కొంతమంది నటీనటులు హీరోహీరోయిన్లుగా నటించినప్పుడు కంటే సైడ్ క్యారెక్టర్లు చేసినప్పుడే ఎక్కువగా గుర్తింపు దక్కించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో అర్చన శాస్త్రీ ఒకరు. ఇప్పటికీ అర్చన అంటే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో త్రిష ఫ్రెండ్‌గానే గుర్తుపెట్టుకున్నారు చాలామంది ప్రేక్షకులు. అందులో తను చేసిన లల్లీ పాత్ర ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది. ఇక తను తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ముక్కుసూటిగా చెప్పేసింది. తను ఇండస్ట్రీలోకి వచ్చే ముందు తెలుగమ్మాయి కాబట్టి సపోర్ట్ దొరుకుందని ఆశించినా అలా జరగలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అదే నమ్ముతాను..
ఇండస్ట్రీలో తను డిసప్పాయింట్ అయిన సందర్భాల గురించి మాట్లాడుతూ ‘‘నన్ను చాలాసార్లు సినిమాల్లో నుంచి తీసేశారు. మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినా వేరేవాళ్లకు తెలియకూడదు అనే మనస్తత్వంతో పెరిగాను. ఇప్పుడు మార్పు వచ్చింది, మనుషులు మాట్లాడుతున్నారు. కానీ నేను అలా కాదు. అలా నేను మాట్లాడితే కంపు అవుతుంది. నేను ఎంతవరకు మాట్లాడగలనో అంతవరకు మాట్లాడతాను. నా యాక్టింగ్ టాలెంట్ గురించి తెలిసి నన్ను సినిమాలోకి తీసుకోవాలి అనుకుంటే అవకాశం అనేది వచ్చితీరుతుంది. అది నేను స్ట్రాంగ్‌గా నమ్ముతాను. 2004 నుంచి 2010 వరకు నేను ఎదుర్కున్న సందర్భాల గురించి చెప్తాను’’ అంటూ అప్పటిరోజులను గుర్తుచేసుకుంది అర్చన.
అలాంటివారు లేరు..
‘‘నాకు ఇండస్ట్రీలో చాలా చిరాకు అనిపించే విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్లినా ఈ అమ్మాయికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, ప్యాషన్ కాబట్టే చేస్తుంది అని ఎవరూ ఆలోచించరు. వేరేవిధంగా ట్రై చేద్దాం, మెసేజ్ పెడదాం, రిప్లై ఇస్తే వేరే ప్రాజెక్ట్ ఇద్దామని పిచ్చిగా ఆలోచించేవారు కూడా ఉన్నారు. నేను ఏ సినిమాలో కూడా బ్యాడ్ యాక్టింగ్ చేయలేదు. కొన్ని ఉల్టా మాటలకు నా రియాక్షన్స్ కావాలంటే అవి రావు. నేను ఇలా ఉండడం వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ మిస్ అయ్యాయి. పోతే పోనీ అనుకున్నాను. ఒకప్పుడు అర్చన మంచి సినిమాలు చేసింది, ఇప్పుడు ఒక అవకాశం ఇద్దాం, తన ఇమేజ్ మారుద్దాం అని ఆలోచించేవారు లేరు. నేను ఇంకా యాక్టర్‌గా ఎవరినీ ఇంప్రెస్ చేయలేదేమో అనిపిస్తుంటుంది’’ అని ముక్కుసూటిగా చెప్పేసింది అర్చన.
సపోర్ట్ చేయలేదు..
‘‘ఆదినగళు అనే కన్నడ సినిమా చేశాను. అందులో మల్లిక అనే పాత్రకు చాలా అవార్డులు వస్తాయని కన్నడ మీడియా కూడా అనుకుంది. కానీ వాళ్లు ఆ అవార్డులను ఒక కన్నడ అమ్మాయికి ఇచ్చారు. తనకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో అలా చేశారు. ఇండస్ట్రీలో చాలామంది పెద్దవాళ్లు ఉన్నారు. వాళ్లెవరూ నాకు సపోర్ట్‌గా ముందడుగు వేయలేదు. ఒకసారి ఒక అవార్డ్ ఫంక్షన్‌లో ఒక పెద్ద హీరోతో పాటు నన్ను పిలిచి అవార్డ్ ఇవ్వమన్నారు. నేను తనతో కలిసి అవార్డ్ ఇవ్వను అని ఆ హీరో స్టేజ్ దిగిపోయారు. తెలుగువాళ్లను తెలుగువాళ్లే ప్రోత్సహించరు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది అర్చన శాస్త్రీ. ఒక మలయాళం హీరో చేసిన మెసేజ్‌లకు తను రిప్లై ఇవ్వలేదని, ఆ సినిమాలో నుంచి తీసేశారని బయటపెట్టింది. ఈ విషయం తన తల్లికి కూడా తెలుసని చెప్పింది.
Also Read: కన్నడ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు - పర్మిషన్ లేకుండా ఆ పనిచేశాడంటూ ఆరోపణలు