AR Rahman: భార్యను తమిళంలో మాట్లాడాలన్న రెహమాన్, నెటిజన్లు ఆగ్రహం - అందులో తప్పేముంది?
భార్యను తమిళంలోనే మాట్లాడాలన్న ఏఆర్ రెహమాన్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. హిందీ సినిమాలతోనే తమరు ఈ స్థాయికి చేరుకున్నారనే విషయాన్ని మరువకూడదంటూ మండిపడుతున్నారు.
చాలా కాలంగా తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. సౌత్ పై నార్త్ డామినేషన్ లో భాగంగా హిందీని తమనై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ తమిళులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, తమిళనాడు ప్రజలు హిందీని తమది కాని భాషగానే భావిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా తమ మాతృభాషలోనే మాట్లాడుతారు. అలాగే, ఏఆర్ రెహమాన్ కూడా తమిళ భాష మాట్లాడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. తాజాగా తమిళం మీద తనకున్న అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేసి నెటిజన్ల చేత దారుణంగా ట్రోలింగ్ కు గురవుతున్నారు.
భార్యను తమిళంలో మాట్లాడాలన్న రెహమాన్
రీసెంట్ గా తమిళనాడులో ‘వికటన్’ సినిమా అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకలో రెహమాన్ తన భార్య సైరాభానుతో కలిసి పాల్గొన్నారు. అంతేకాదు, వేదికపైకి తన భార్యతో కలిసి వెళ్లి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడారు. ఆ తర్వాత సైరాభానును కూడా మాట్లాడాలని నిర్వాహకులు కోరారు. భార్య మాట్లాడే సమయంలో రెహమాన్ కల్పించుకుని, హిందీలో కాదు తమిళంలో మాట్లాడాలని చెప్పారు. అందుకు సమాధానంగా సైరాభాను, తనకు తమిళం అంతగా మాట్లాడ్డం రాదని చెప్తూ, ఇంగ్లీషులో మాట్లాడారు. తన భర్త వాయిస్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. ఆయన వాయిస్ వినే ప్రేమలో పడిపోయానని వెల్లడించింది.
கேப்புல பெர்பாமென்ஸ் பண்ணிடாப்ள பெரிய பாய்
— black cat (@Cat__offi) April 25, 2023
ஹிந்தில பேசாதீங்க தமிழ்ல பேசுங்க ப்ளீஸ் 😁 pic.twitter.com/Mji93XjjID
రెహమాన్‌పై నెటిజన్ల ఆగ్రహం
స్టేజి మీద భార్యను తమిళంలో మాట్లాడాలని రెహమాన్ చెప్పడం పట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరచుకుపడుతున్నారు. తమరు ఈ రోజు ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నావంటే కారణం హిందీ చిత్ర పరిశ్రమ అనే విషయాన్ని మరువకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందీ సినిమాలు, హిందీ ప్రేక్షకుల సపోర్టుతో ఎదిగిన నీకు, ఈ రోజు హిందీ పనికిరాకుండా పోయిందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. బ్రిటీష్ వాళ్లు వదిలి వెళ్లిపోయిన ఇంగ్లీష్ నచ్చుతుంది గానీ, హిందీ మాత్రం నచ్చదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెహమాన్ లాంటి వ్యక్తి భాష, ప్రాంతం లాంటి విషయాలకు అతీతంగా ఉండాల్సింది పోయి, ఆయన భార్యకు నచ్చిన భాషను మాట్లాడకుండా అణిచివేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అయితే, ఆ కార్యక్రమం తమిళనాడులో జరిగిందని, కార్యక్రమంలో ఉన్నది కూడా తమిళ ప్రేక్షకులే కావడంతో రెహమాన్ అలా చెప్పి ఉండవచ్చని, దీనిపై ఇంత చర్చ అవసరం లేదని మరికొందరు అంటున్నారు. తన నేలపై తన భాషపై ప్రేమను చూపించడంలో తప్పులేదని అంటున్నారు.
సౌత్, నార్త్ సినిమాలకు అద్భుత సంగీతం అందించిన రెహమాన్
వాస్తవానికి ఏఆర్ రెహమాన్ దక్షిణాది సినీ పరిశ్రమతో పాటు బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలకు పని చేశారు. ‘రంగీలా’, ‘తాళ్’, ‘దిల్ సే’, ‘స్వదేశ్’, ‘రంగ్ దే బసంతి’, ‘సంజూ’, ‘తమాషా’ సహా పలు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించారు. మూడు దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో కొనసాగుతున్న ఆయన హిందీ, తమిళ్, తెలుగు, కన్నడతో పాటు పలు ఇంగ్లీష్ సినిమాలకు సంగీతం అందించారు. ఎన్నో వేల పాటలు పాడారు. రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు.కానీ, తను తమిళ పరిశ్రమకు చెందిన వారు కావడంతో, ఆ భాష అంటే ఆయనకు ఎంతో ఇష్టం. హిందూ కుటుంబంలో జన్మించి ముస్లీంగా మారిన ఆయన, తమిళ భాషను మాట్లాడేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. తాజాగా ఆయన సంగీతం అందించిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ ఈనెల 28న రిలీజ్ కానుంది.
Read Also: గోపిచంద్‌తో తేజా వాడీవేడీ వాదన - ఆ ప్రోమోపై ఫ్యాన్స్ ఆగ్రహం, స్పందించిన మాచో స్టార్