అన్వేషించండి

AR Rahman On Peddi: రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు రెహమాన్ రివ్యూ... ఆస్కార్ విన్నర్ ఏమన్నారంటే?

AR Rahman Reviews Peddi: 'పెద్ది'లో రామ్ చరణ్ విశ్వరూపం చూపించారని ఆస్కార్ విన్నర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాకు ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?

రామ్ చరణ్ 'పెద్ది' (Peddi) సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు  ఉన్నాయి. ఆస్కార్ విన్నర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) వాటిని మరింత పెంచారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన 'పెద్ది కీ ఆవాజ్' (Peddi Ki Aawaz)లో రామ్ చరణ్ నటనపై రెహమాన్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాకు రివ్యూ (Peddi Review) ఇవ్వమని అడగ్గా... ఆయన ఏం చెప్పారంటే?  

ప్రతి ఫ్రేమ్‌లోనూ చరణ్ కష్టం కనిపిస్తుంది
'పెద్ది' సినిమా కోసం, ఆ పాత్రలో నటన కోసం రామ్ చరణ్ పడిన కష్టం, చూపించిన అంకితభావం అమోఘమని ఏఆర్ రెహమాన్ చెప్పారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో ఆయన నటన అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు.

రామ్ చరణ్ డ్యాన్స్ గురించి రెహమాన్ మాట్లాడారు. ''నా పాటలకు రామ్ చరణ్ డ్యాన్స్, ఆ ఎనర్జీ కొత్త అర్థాన్ని ఇచ్చాయి. ఓ హీరో పాటలోని ప్రతి మూమెంట్‌ను మనస్ఫూర్తిగా ఓన్ చేసుకున్నప్పుడే ఆ సంగీతానికి పూర్తి ప్రాణం వస్తుంది. రామ్ చరణ్ విషయంలో అది అక్షరాలా నిజమైంది. తన డ్యాన్స్ వల్ల సాంగ్స్ మరింత హిట్ అయ్యాయి" అని రెహమాన్ చెప్పారు. 'పెద్ది'గా రామ్ చరణ్ నటన తెలుగుతో పాటు మిగతా భాషల ప్రేక్షకులనూ కట్టి పడేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భోపాల్ ఈవెంట్ స్పెషాలిటీ ఏమిటంటే... 'పెద్ది' సినిమాలోని 'రై రై రారా' పాటకు రెహమాన్ స్వయంగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

Also Read: Drishyam 3 Three Days Collections - మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్... 100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'

దర్శకుడు బుచ్చిబాబు సానా మేకింగ్ స్టైల్, హీరోయిన్ జాన్వీ కపూర్ నటనను కూడా ఏఆర్ రెహమాన్ మెచ్చుకున్నారు. అంతే కాదు... మెగా ఫ్యాన్స్, 'పెద్ది' సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు రెహమాన్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. సినిమాలో మరికొన్ని పాటలు ఉన్నాయని చెప్పారు. కథలో భాగంగా కొన్ని పాటలు వచ్చాయని, నేపథ్యంలో అవి వినిపిస్తాయని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ఆయన తెలిపారు.

Also Read: Ansiba Hassan - Jihadi Remark Controversy: జిహాదీ అన్నాడు... వేధించారు... బాంబు పేల్చిన 'దృశ్యం 3' నటి

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PEDDI (@peddimovie)

వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన 'పెద్ది' జూన్ 4న థియేటర్లలోకి వస్తోంది. జూన్ 3న అమెరికాలో ప్రీమియర్లు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేశారు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, రవి కిషన్, దివ్యేందు శర్మ తదితరులు సినిమాలో నటించారు. 

Also Read: Ram Charan On Jasprit Bumrah - రామ్ చరణ్ మళ్ళీ దొరికేశాడు... క్రికెటర్‌ను ఫుట్ బాలర్ చేశాడు

టాప్ హెడ్ లైన్స్

Aadarsha Kutumbam First Day Collection : వెంకీ ఆదర్శ కుటుంబం ర్యాంపేజ్ స్టార్ట్ - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
వెంకీ ఆదర్శ కుటుంబం ర్యాంపేజ్ స్టార్ట్ - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Cult Review - కల్ట్ రివ్యూ: స్క్విడ్ గేమ్ టైపులో... దర్శకుడిగా, హీరోగా విశ్వక్ సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
కల్ట్ రివ్యూ: స్క్విడ్ గేమ్ టైపులో... దర్శకుడిగా, హీరోగా విశ్వక్ సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Aadarsha Kutumbam Review - 'ఆదర్శ కుటుంబం' రివ్యూ: వెంకీతో త్రివిక్రమ్ కొత్త సినిమా - హిట్టా? ఫట్టా?
'ఆదర్శ కుటుంబం' రివ్యూ: వెంకీతో త్రివిక్రమ్ కొత్త సినిమా - హిట్టా? ఫట్టా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget