News
News
వీడియోలు ఆటలు
X

Aparna Das In PVT 04 : మెగా మేనల్లుడి సినిమాతో తెలుగు తెరకు మలయాళ నటి, 'సార్' తర్వాత జీవీ మళ్ళీ

శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ 'PVT04' సినిమాలో మలయాళ నటి అపర్ణా దాస్ నటించనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమె వజ్ర కాళేశ్వరి దేవి పాత్రలో కనిపించనున్నట్టు వెల్లడించారు

FOLLOW US: 
Share:

మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్ లాంటి మలయాళ యాక్టర్స్ ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. ఇప్పుడు వీరి సరసన మరో మలయాళ నటి కూడా జత కూడబోతోంది. ఆమే అపర్ణా దాస్. దక్షిణాదిలో మంచి సినిమాలు చేసి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ నటి... మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం 'PVT04'లో నటించనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

'న్జన్ ప్రకాశన్', 'మనోహరం', 'బీస్ట్' వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అపర్ణా దాస్. ఆమె ఇటీవల నటించిన 'దాదా' చిత్రం సినీ విమర్శకులను సైతం మెప్పించింది. తాజాగా ఆమె.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో చిత్రంగా రూపొందుతున్న  'PVT04'లో నటించనున్నట్టు మూవీ మేకర్స్ అఫిషియల్ గా వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె "వజ్ర కాళేశ్వరి దేవి' పాత్రను పోషిస్తున్నట్టు ప్రకటించారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రబృందం ఈ మూవీని పక్కా ప్రణాళికతో రూపొందిస్తోందిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల నటించనున్నారు. వీరితో పాటు ఈ సినిమాలో జోజు జార్జ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాతో అపర్ణా దాస్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతుండగా.. శ్రీకాంత్ ఎన్ రెడ్డి కూడా ఈ సినిమాతోనే డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు.

'PVT04'కు సంబంధించి మేకర్స్ మరో అప్ డేట్ కూడా ఇచ్చారు. ఈ మూవీకి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చనున్నట్టు వెల్లడించారు. వెట్రిమారన్ - ధనుష్ 'అసురన్' (2019) , సుధా కొంగర - సూర్య 'సూరరై పొట్రు' (2020) సినిమాలకు స్వరాలు సమకూర్చిన జీవీ ప్రకాష్ కుమార్.. 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'కథానాయకుడు', 'ఎందుకంటే... ప్రేమంట!' సినిమాలకు చక్కటి సంగీతం ఇచ్చి తెలుగులో ప్రేక్షకుల మన్ననలూ పొందారు. ఆయన సంగీతం వహించిన 'PVT04'లోని పాటలు త్వరలోనే రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై చిత్రీకరిస్తోన్న 'PVT04' సినిమాను తెలుగు సినీ ప్రేమికులు తప్పక థియేటర్లలో చూసి ఆనందిస్తారని మేకర్స్ విశ్వసిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి అడుగుపెడుతోన్న అపర్ణా దాస్ మరింత ఆకర్షణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి ఎస్ నాగ వంశీ, ఎస్ సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

Also Read : మూడో భార్యను తన్నిన నరేష్, పవిత్రతో ప్రేమ కథ - 'మళ్ళీ పెళ్లి' ట్రైలర్‌లో అన్నీ...

2020లో పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. అంతకుముందు 'జానీ', 'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్', 'అందరివాడు' చిత్రాల్లో బాలనటుడిగానూ ఆయన అలరించారు. ఉప్పెన భారీ విజయాన్న దక్కించున్న వైష్ణవ్ తేజ్.. కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాల్లోనూ నటించి మంచి పేరు సాధించారు.

Also Read : పెళ్లి నుంచి మోహన్ బాబు షూటింగుకు, హనీమూన్ లేదు, ఏవీఎస్ రూమ్‌లో ఫస్ట్ నైట్ – బ్రహ్మాజీ

Published at : 11 May 2023 12:08 PM (IST) Tags: gv prakash kumar Srileela PVT04 Aparna Das Srikanth N Reddy Panja Vaisshnavj Tej

సంబంధిత కథనాలు

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

టాప్ స్టోరీస్

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!