Malli Pelli Movie Trailer : మూడో భార్యను తన్నిన నరేష్, పవిత్రతో ప్రేమ కథ - 'మళ్ళీ పెళ్లి' ట్రైలర్లో అన్నీ...
Naresh Pavitra's Malli Pelli Trailer Review : నరేష్, పవిత్రా లోకేష్ జంటగా ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన 'మళ్ళీ పెళ్లి' ట్రైలర్ విడుదలైంది.

నవరస రాయ నరేష్ విజయకృష్ణ (Naresh Vijaya Krishna), ప్రముఖ నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) హీరో హీరోయిన్లుగా రూపొందిన సినిమా 'మళ్ళీ పెళ్లి'. మెగా ఫిల్మ్ మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్ సంస్థను పునః ప్రారంభించారు. దీనికి నరేష్ విజయ కృష్ణ నిర్మాత.
'మళ్ళీ పెళ్లి'ని సినిమా అనడం కంటే నరేష్, పవిత్రాల బయోపిక్ (pavitra naresh biopic) లేదా సెమీ బయోపిక్ అనడం కరెక్ట్ అని కొందరు చెబుతున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజరే అందుకు కారణం. ఇప్పుడు బోల్డెస్ట్ కపుల్ గురించి మరింత తెలుసుకోమని చెబుతూ ట్రైలర్ విడుదల చేశారు.
'మళ్ళీ పెళ్లి' ట్రైలర్ ఎలా ఉందంటే?
'మళ్ళీ పెళ్లి' ట్రైలర్ చూస్తే... నరేష్ జీవితంలో జరిగిన ఘటనలు, సంఘటనల సమాహారమే అని అర్థం అవుతోంది. అయితే... సినిమాలో పేర్లు మార్చారు. నరేంద్రగా నరేష్, పార్వతిగా పవిత్రా లోకేష్ కనిపించారు. మూడో భార్య రమ్యా రఘుపతి పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించారు.
నరేష్, పవిత్రా లోకేష్ పరిచయం ప్రేమగా ఎలా మారింది? టాపిక్ నుంచి 'మా' ఎలక్షన్స్, బెంగళూరు ఎపిసోడ్ & మూడో భార్యను ఆయన కాలి మీద తన్నడం వరకు 'మళ్ళీ పెళ్లి' ట్రైలర్లో అన్నీ చూపించారు. మేడమ్ (విజయ నిర్మల) కొడుకు నరేంద్ర అని అన్నపూర్ణమ్మ చెప్పే డైలాగ్ వింటుంటే... ఎటువంటి మొహమాటాలకు పోలేదని తెలుస్తోంది. డైలాగుల్లో కొన్ని డబుల్ మీనింగ్స్ కూడా చోటు చేసుకున్నాయి. వెయ్యి కోట్ల ఆస్తి నరేష్ వెనుక ఉందని చెప్పకనే చెప్పారు. ముసలోడు అని కనికరించి పెళ్లి చేసుకుంటే అని వనితా విజయ్ కుమార్ చేత ఓ డైలాగ్ చెప్పించారు. నరేష్ సైడ్ తీసుకున్నట్లు కాకుండా కొన్ని సన్నివేశాల్లో ఆయన్ను నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేశారు.
Also Read : శకుంతలే కాదు, సమంత 'శాకుంతలం' కూడా అనాథే
అనన్యా నాగళ్ళ గ్లామర్ హైలైట్ అయ్యేలా...
'మళ్ళీ పెళ్లి' నుంచి ఇప్పటికి రెండు పాటలు విడుదల చేశారు. తొలి పాట 'ఉరిమే మేఘమా...'లో నరేష్, పవిత్రా లోకేష్ ఎక్కువ కనిపించారు. ఆ తర్వాత విడుదల చేసిన రెండో పాట 'రా రా హుస్సూర్ నాతో...'లో వాళ్ళిద్దరితో పాటు 'వకీల్ సాబ్', 'మల్లేశం', 'ప్లే బ్యాక్' సినిమాల ఫేమ్ అనన్యా నాగళ్ళ గ్లామర్ హైలైట్ అయ్యింది.
మే 26న 'మళ్ళీ పెళ్లి' విడుదల
వేసవిలో 'మళ్ళీ పెళ్లి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ నెల 26న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలుగు, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.
Also Read : చేతకాని వాళ్ళు అదుపు తప్పారు, తిడితే వాళ్ళ నోరే కంపు అవుతుంది - అనసూయ ఫైర్
జయసుధ, శరత్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

