By: ABP Desam | Updated at : 11 May 2023 11:08 AM (IST)
బ్రహ్మాజీ దంపతులు ( Photo Credit: Actor Brahmaji/Instagram)
చాలా మంది జీవితాల్లో పెళ్లి అనేది చాలా మెమరబుల్ గా ఉంటుందని, కానీ, తమ పెళ్లి సినిమాటిక్ గా జరిగిందన్నారు నటుడు బ్రహ్మాజీ. తన భార్య శాశ్వతితో కలిసి వెన్నెల కిశోర్ ‘అలా మొదలయ్యింది’ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ పరిచయం, ప్రేమ, పెళ్లి విషయాల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా శాశ్వతి పరిచయం అయినట్లు బ్రహ్మాజీ తెలిపారు. అప్పటికే తనకు పెళ్లై, విడాకులు తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
బ్రహ్మాజీ గురించి ఎవరికీ తెలియని పలు విషయాలు చెప్పారు శాశ్వతి. “బ్రహ్మాజీవి పెద్ద కళ్లు. చక్కటి జుట్టు ఉండేది . కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశాం. చాలా ఏండ్లు ఫ్రెండ్స్ గానే ఉన్నాం. తను నన్ను ఇష్టపడుతున్నాడు అనే విషయం ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. కానీ, నాకు తెలియలేదు. ఎందుకంటే నాకు కొంచె బుర్ర తక్కువ. నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పింది. బ్రహ్మాజీ నిన్ను ఇష్టపడుతున్నాడు అని. ఆ తర్వాత నాకు తనపై ఇష్టం కలిగింది” అని శాశ్వతి చెప్పారు.
శాశ్వతి ప్రేమ కోసం ప్రత్యేకంగా ఏం ట్రై చేలేదని చెప్పారు బ్రహ్మాజీ. “మనిషిలో మనం చూసేది క్యారెక్టర్, పర్సనాలిటీ, ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? అనేది గమనిస్తాం. ఈ క్యారెక్టర్ బాగుంది. నచ్చింది. ఇద్దరం తరుచుగా కలిసేవాళ్లం ఫ్రెండ్స్ తో. ఒక రోజు వర్షం వస్తోంది. ఉరుములు వస్తున్నాయి. మూన్ లైట్ లో వెళ్లి తనకు ఐ లవ్ యు చెప్పుకున్నాం” అన్నారు. అయితే, తాను ముందుగా, తనకు ఐ లవ్ యు చెప్పలేదని బ్లేడ్ తో చేయి కోసుకున్నాడని చెప్పారు శాశ్వతి. వెంటనే అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆ తర్వాత ఐ లవ్ యు చెప్పినట్లు వివరించారు.
ఇద్దరు ఐ లవ్ యు చెప్పుకున్న కొద్ది రోజులకు హైదరాబాద్ లోని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నట్లు బ్రహ్మాజీ చెప్పారు. ఇరు కుటుంబ సభ్యులకు తెలియకుండా మిత్రుల సహకారంతో తమ పెళ్లి జరిగిందన్నారు. కృష్ణ వంశీ, రమ్యకృష్ణ, గంగరాజు, నందిని సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. పెళ్లి పూర్తి అయిన తర్వాత గ్రూఫ్ ఫోటో దిగిన కాసేపటికే మోహన్ బాబు సినిమా షూటింగ్ కు వెళ్లినట్లు చెప్పారు. మోహన్ బాబు ఫోన్ చేసి, షూటింగ్ కు వస్తున్నవా? లేదా? అన్నారని చెప్పారు. వెంటనే పెళ్లి దుస్తులు తీసేసి, షూటింగ్ కు వెళ్లిపోయినట్లు తెలిపారు. అప్పట్లో ఏవీఎస్ తన రూమ్మేట్ అని బ్రహ్మాజీ చెప్పారు. నీ ఫస్ట్ నైట్ నాతో గడుపుతున్నావ్ అని కామెడీ చేశారన్నారు. పెళ్లి అయ్యాక వెళ్లి మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చినట్లు చెప్పారు. ప్రత్యేకంగా హనీమూన్ అంటూ ఏమీ లేదన్నారు. ఇక శాశ్వతి బర్త్ డే సందర్భంగా అప్పుడప్పుడు సర్ ప్రైజ్ చేస్తానని బ్రహ్మాజీ చెప్పారు. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ని లేదంటే ఫ్రెండ్స్ ని రప్పించి బర్త్ డే వేడుకలు జరుపుతానని వెల్లడించారు.
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!
OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే
SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!
PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా
లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!