Anushka Shetty: చలో ఇంటర్నేషనల్ - అనుష్క 48వ సినిమాలో ఆమె రోల్ అదే
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె రోల్ ఎంతనేది తెలిసింది.
అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పోలిశెట్టి .(Naveen Polishetty) ప్రధాన పాత్రల్లో యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ కొంత షూటింగ్ చేశారు. రీసెంట్ గా మళ్ళీ షూటింగ్ మొదలైంది.
ఈ సినిమాలో అనుష్క ఇంటర్నేషనల్ షెఫ్ రోల్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే... ఆమె వంటలు చేస్తూ కనిపిస్తారు అన్నమాట. వంటలక్క ఏం చేస్తారన్నది ఆసక్తికరం .
అనుష్కకు 48వ చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. వాటి తర్వాత ఆ సంస్థలో అనుష్క నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఇందులో ఆమె సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.
Also Read : చెన్నై అపోలో ఆస్పత్రిలో మణిరత్నం, ఆందోళనలో ఫ్యాన్స్ - ఆయనకు ఏమైందంటే?
త్వరలో సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం... నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
Also Read : చిరంజీవి అబద్ధాలకు పడతారు కానీ పవన్ కళ్యాణ్‌ను కన్వీన్స్ చేయడం కష్టమే!
View this post on Instagram
View this post on Instagram