Nagarjuna: కింగ్ నాగార్జునకు జోడీగా స్వీటీ? - హిట్ పెయిర్ మరోసారి రిపీట్... రోల్ ఏంటో తెలుసా?
Nagarjuna Anushka Shetty: కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుండగా... తాజాగా మరో కొత్త పేరు వైరల్ అవుతోంది.

Anushka Shetty To Play Key Role In Nagarjuna 100th Movie: 'కుబేర', 'కూలీ' మూవీస్‌తో ఫుల్ సక్సెస్ జోష్‌లో ఉన్న కింగ్ నాగార్జున ప్రస్తుతం తన 100వ చిత్రం తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ మూవీకి తమిళ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వం వహించనుండగా... రీసెంట్‌గానే పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ ప్రారంభమైంది. సైలెంట్‌గానే మూవీని స్టార్ట్ చేయగా త్వరలోనే పూర్తి షెడ్యూల్ ప్రారంభం కానుంది.
హిట్ పెయిర్ రిపీట్?
ఈ మూవీలో హిట్ పెయిర్స్ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ రోల్ కోసం సీనియర్ హీరోయిన్ టబును సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అప్పట్లో నాగ్, టబు కాంబోలో వచ్చిన 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడా మా ఆవిడే' మూవీస్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారనే వార్తలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. తాజాగా మరో బజ్ ఫిలింనగర్ వర్గాల్లో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో కీలక పాత్ర కోసం స్వీటీ అనుష్కను మూవీ టీం సంప్రదించిందట. ఆ రోల్ చాలా ఇంపార్టెంట్ అని అనుష్క అయితేనే బాగుంటుందని భావిస్తోందట. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. 'సూపర్' సినిమాలో నాగ్, అనుష్క జంటగా నటించారు. ఆ తర్వాత వచ్చిన 'డాన్', 'ఢమరుకం', 'రగడ' చిత్రాలతోనూ హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ఇక నాగార్జున కెరీర్‌లో హిట్ చిత్రంగా నిలిచిన 'సోగ్గాడే చిన్నినాయనా' మూవీలో గెస్ట్ రోల్ చేశారు. అలాగే, 'ఓం నమో వెంకటేశాయ' మూవీలో వెంకటేశుని భక్తురాలిగా నాగార్జునతో కలిసి కనిపించారు. ఇప్పుడు 'కింగ్ 100' మూవీలో హీరోయిన్‌గా నటిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: నేరుగా ఓటీటీలోకే సూపర్ నేచురల్ థ్రిల్లర్ - 'బారాముల్లా' వరల్డ్ ఆ రోజు నుంచే చూసెయ్యండి
ఫస్ట్ టైం ఆ జానర్‌లో...
ఈ మూవీలో నాగార్జున ఫస్ట్ టైం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హై ఓల్టేజ్ పొలిటికల్ డ్రామాగా మూవీ తెరకెక్కనుండగా... నాగ్ డ్యుయెల్ రోల్‌లో 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయబోతున్నారనే ప్రచారం సాగుతోంది. పొలిటికల్ టచ్ ఉన్న స్టోరీలో ఆయన రోల్స్ ఏంటి? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇందులో సీఎం రోల్ ఇంపార్టెంట్ కానుండగా స్టార్ హీరోయిన్ చేయబోతున్నారట. ఆమె అనుష్కేనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే హీరోయిన్స్ ఎవరు? ఇతర నటీనటుల గురించి పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది.
టైటిల్ ఏంటంటే?
ప్రస్తుతానికి 'కింగ్ 100' వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరగనుండగా... 'లాటరీ కింగ్' అనే టైటిల్ ఫిక్స్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే షెడ్యూల్ ప్రారంభం కానుంది. తన కెరీర్‌లోనే ఈ 100వ చిత్రం ఓ మైలురాయిలా నిలిచిపోవాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగినట్లుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున ప్రొడ్యూస్ చేస్తుండగా... త్వరలోనే షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.





















