అన్వేషించండి

Anirudh Ravichandran : జెర్సీ' డైరెక్టర్ కోసం అనిరుద్ - చిన్న సినిమాకి 'దేవర' మ్యూజిక్ డైరెక్టర్ అభయం!

Anirudh : జెర్సీ మూవీ ఫేమ్ గౌతం తిన్ననూరి తెర్కెక్కిస్తున్న ఓ చిన్న సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం.

Anirudh to compose music for Jersey director’s next: కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ పేరు ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా మారుమోగిపోతుంది. సౌత్ లో భారీ డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఇతను గత ఏడాది షారుక్ ఖాన్ 'జవాన్' తో బాలీవుడ్లో భారీ సక్సెస్ అందుకున్నాడు. దీంతో అనిరుద్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. అతను సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడంటే చాలు అక్కడికే సగం సినిమా సక్సెస్ అయినట్లే లెక్క. అందుకే దర్శక నిర్మాతలు సైతం అతనితో పనిచేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. 'అనిరుద్ కూడా అవకాశాలు వస్తున్నాయి కదా' అని ఓకే చెప్పకుండా కథ, క్యాస్టింగ్ నచ్చితే మాత్రమే 'ఎస్' చెబుతున్నాడు.

ప్రస్తుతం ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన ఎన్టీఆర్ 'దేవర'కి మ్యూజిక్ కంపోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. దేవర కోసం తాను ఇవ్వబోయే మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికే గ్లింప్స్ వీడియో ద్వారా చూపించాడు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న అనిరుద్ ఇప్పుడు ఓ చిన్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'జెర్సీ' మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించే ఓ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారట. గౌతమ్, సితార బ్యానర్ లో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ తో బిజీ అవడంతో ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ఫిబ్రవరిలో ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. అందుకే నెలల తరబడి ఖాళీగా ఉండడం ఇష్టం లేక గౌతమ్ తిన్ననూరి ఈ లోపు కొత్త వాళ్ళతో ఒక చిన్న సినిమాను తీసేసాడు. చిత్రీకరణ కూడా దాదాపు పూర్తయిపోయిందట. ఈ చిన్న సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించినట్లు సమాచారం. మరో ట్విస్ట్ ఏంటంటే పాటలన్నీ కొద్ది నెలల క్రితమే పూర్తి చేశాడట. ప్రస్తుతం బ్యాగ్రౌండ్ స్కోర్ త్వరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలకే మ్యూజిక్ కంపోస్ట్ చేసే అనిరుద్ ఈ చిన్న సినిమాకి పనిచేయడానికి కారణం గౌతమ్ తిన్ననూరితో ఉన్న ఫ్రెండ్షిప్ అని తెలుస్తుంది.

జెర్సీ మూవీ టైం నుంచి ఇద్దరు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అందుకే ఆయన తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి మంచి అవుట్ ఫుట్ ఇచ్చేందుకు అనిరుద్ ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. కాగా జెర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అవడంతో ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

Also Read : ఓవర్సీస్‌లో 'హనుమాన్' జోరు - 4 రోజుల్లోనే 'RRR', బాహుబలి రికార్డ్స్ బ్రేక్

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget