Animal Movie Launched: 'యానిమల్' సెట్స్‌కు కొత్త పెళ్ళికొడుకు రణ్‌బీర్, రష్మిక - హిమాలయాల్లో షూటింగ్ మొదలు
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న 'యానిమల్' రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
దర్శకుడిగా పరిచయమైన 'అర్జున్ రెడ్డి' సినిమాతో సందీప్ రెడ్డి వంగా సంచలన విజయం అందుకున్నారు. స్టోరీ టెల్లింగ్ పరంగా కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆ సినిమాను హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి... అక్కడ కూడా భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా 'యానిమల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సినిమాను ప్రకటించారు. ఇప్పుడురెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.
రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న 'యానిమల్' సినిమా (Animal Movie) ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇందులో రష్మిక మందన్నా కథానాయిక. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజే మొదలు పెట్టారు. హిమాలయాల్లో షూటింగ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత రణ్‌బీర్ స్టార్ట్ చేసిన చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ కోసం రణ్‌బీర్, రష్మిక మనాలి వెళ్లారు. అక్కడే షూటింగ్ చేస్తున్నారు.
టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్ కుమార్, ప్రణవ్ రెడ్డి వంగా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా కథ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని, రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం పేర్కొంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం రణ్‌బీర్ స్పెషల్‌గా మేకోవర్ అవుతున్నారట.
Also Read: హీరో కార్తికేయ కొత్త సినిమాలో సిరివెన్నెల ఆఖరి పాట - షూటింగ్ షురూ
హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.