Mowgli Glimpse: అడవిలో సుమ కొడుకు లవ్ స్టోరీ - నాని వాయిస్ ఓవర్‌తో 'మోగ్లీ' గ్లింప్స్
Mowgli: ప్రముఖ యాంకర్ సుమ తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మోగ్లీ' నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

Roshan Kanakala's Mowgli Glimpse Out: రాజీవ్ కనకాల, యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మోగ్లీ'. కలర్ ఫోటో ఫేం సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ ఆకట్టుకోగా... తాజాగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. నేచరల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ అందించారు.
ఫారెస్ట్‌లో ఓ చిన్న లవ్ స్టోరీ
లవ్ రొమాంటిక్ జానర్‌లో 'మోగ్లీ' మూవీ తెరకెక్కుతోందని గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతోంది. 'మీకు ఓ చిన్న ప్రేమ కథ చెప్తా' అంటూ నాని వాయిస్ ఓవర్‌తో ఓ అందమైన ఫారెస్ట్‌లో లవ్ స్టోరీని మరింత అందంగా చూపించారు. '2025... టెక్నాలజీ ఇంకా పూర్తిగా డెవలప్ కాని రోజులు. అడివిలోకి వెళ్తే కనీసం ఫోన్ సిగ్నల్స్ కూడా వచ్చేవి కావు.' అంటూ చెప్పడం ఆసక్తిని పెంచేసింది. 'పాతికేళ్లు కూడా నిండని ఓ ప్రేమికుడు 30 మందికి తిండి నిద్ర లేకుండా పరిగెత్తించాడు.' అంటూ భారీ ఎలివేషన్ ఇవ్వగా... అడవిలో ఉండే హీరోకు బాహ్య ప్రపంచంలో ఉన్న హీరోయిన్ మధ్య లవ్ స్టోరీని అందంగా చూపించినట్లు తెలుస్తోంది.
ఎవరీ మోగ్లీ?
ఈ మూవీలో రోషన్ సరసన సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'మోగ్లీ' గ్లింప్స్‌ను బట్టి చాలా వరకూ అడవిలో సాగే ఓ అందమైన లవ్ స్టోరీ అని తెలుస్తుండగా... అసలు రోషన్ రోల్ ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిరిగిన పోలీస్ యూనిఫాం, ఆ పక్కనే పవర్ స్టోరీ గబ్బర్ సింగ్ పోస్టర్స్ ఉండగా... అసలు అడవిలో ఉండే పోలీసా? లేదా వారియరా? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. 'ఓ చిన్న ప్రేమ కథ, ఆ ప్రేమ కోసం ఓ యుద్ధం' అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్.
'ద లౌడెస్ట్ వార్ ఆఫ్ ఏ సైలెంట్ లవ్ స్టోరీ' అంటూ క్యాప్షన్ ఇవ్వగా అసలు హీరోయిన్‌ను హీరో ఎలా కలిశారు? ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది?హీరో అడవిలో ఎందుకు ఉన్నాడు? విలన్‌కు, హీరోయిన్‌కు సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా... కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఒక చిన్న ప్రేమ కథ ❤🔥
— People Media Factory (@peoplemediafcy) August 29, 2025
ఆ ప్రేమ కోసం ఒక పెద్ద యుద్ధం ❤🔥
“𝐓𝐇𝐄 𝐖𝐎𝐑𝐋𝐃 𝐎𝐅 𝐌𝐎𝐖𝐆𝐋𝐈” glimpse out now!
▶️ https://t.co/rsVxc5ukU9@SandeepRaaaj directorial.
🌟ing @RoshanKanakala & #SakshiMhadolkar
A @Kaalabhairava7 musical 🎵 #Mowgli#Mowgli2025@vishwaprasadtg… pic.twitter.com/hLz3ZSkAjo
Also Read: సడన్‌గా ఓటీటీలోకి మొగలిరేకులు హీరో క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఫస్ట్ మూవీ 'బబుల్ గమ్'తో కమర్షియల్‌గా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినా తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు రోషన్ కనకాల. ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఎంటర్‌టైన్ చేసేందుకు వస్తున్నారు. కలర్ ఫోటోతో మంచి హిట్ సొంతం చేసుకున్న సందీప్ రాజ్ మరోసారి 'మోగ్లీ'తో హిట్ కొట్టాలని భావిస్తున్నారు. గ్లింప్స్ రిలీజ్ చేస్తూనే 'ఈ ఏడాది మీకు మంచి సినిమా ఇస్తానని హామీ ఇస్తున్నా. ఇది నా మోగ్లీ' అంటూ ట్వీట్ చేశారు.





















