News
News
వీడియోలు ఆటలు
X

'బాబోయ్.. పైత్యం'.. అనసూయ 'The' ట్వీట్ విజయ్ దేవరకొండని ఉద్దేశించేనా..?

యాంకర్ అనసూయ భరద్వాజ్, హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వార్ మళ్ళీ మొదలైంది. 'బాబోయ్.. పైత్యం' అంటూ తాజాగా అనసూయ పెట్టిన ట్వీట్ పై ఫైర్ అవుతున్నారు. ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

FOLLOW US: 
Share:
బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓవైపు టీవీ షోలలో తన హాట్ నెస్ తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. పలు అంశాలపై స్పందించే తీరు, పరోక్షంగా ఎవరినో ఒకరిని ఉద్దేశిస్తూ పెట్టే ట్వీట్స్ వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. అయితే తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సరికొత్త కాంట్రవర్సీకి తెర లేపింది.. హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ విరుచుకుపడేలా చేసింది.
 
అనసూయ ట్వీట్ చేస్తూ.. "ఇప్పుడే ఒకటి చూశాను.. ‘The’నా?? బాబోయ్.. పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం" అని పేర్కొంది. ఆమె ఇక్కడ ఎవరి పేరునీ మెన్షన్ చేయనప్పటికీ, 'The' అనే పదాన్ని ప్రస్తావించడం వల్ల ఆమె రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని టార్గెట్ చేసినట్లుగా అందరూ భావిస్తున్నారు. దీనికి కారణం 'ఖుషీ' పోస్టర్స్ అనే చెప్పాలి.
 
విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'ఖుషీ' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మే 9న VD బర్త్ డే స్పెషల్ గా 'నా రోజా నువ్వే' అనే ఫస్ట్ సింగిల్ ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ ను వదిలారు. 
 
అయితే 'ఖుషి' పోస్టర్ లో 'THE విజయ్ దేవరకొండ' అని పేర్కొనబడింది. ‘ది’ అనే పదాన్ని యూనిక్ విషయాలకు, వస్తువులకు వాడుతూ ఉంటారు. ఇక్కడ VD కూడా ఒక యూనిక్ అని అర్థం వచ్చేలా ఇలా పేరు ముందు ఇలా ‘ది’ పదాన్ని యాడ్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా అనసూయ భరద్వాజ్ 'The' అని ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది.
 
అనసూయ ట్వీట్ పై రౌడీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. హీరోలంతా తమ పేర్ల ముందు స్టార్ ట్యాగ్ తగిలించుకుంటున్నప్పుడు, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఓ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ పేరు ముందు The అని పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. నువ్వు The అనసూయ, The ఆంటీ అని పెట్టుకో ఎవరు వద్దన్నారు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో అనసూయ ట్వీట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించే అనే విషయంపై మరింత క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ పెట్టింది. "భలే రియాక్ట్ అవుతున్నార్రా దొంగ.. oops.. బంగారుకొండలంతా.. ఎక్కడో అక్కడ నేను నిజం అనేది ప్రూవ్ చేస్తూనే ఉన్నందుకు థ్యాంక్స్ రా అబ్బాయిలు" అని అనసూయ ట్వీట్ చేసింది. అయితే ఇటీవల కాలంలో సైలెంట్ గా ఉన్న ఆమె.. అటెన్షన్ కోసమే ఇప్పుడు ఈ ట్వీట్ చేసిందని వీడీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
 
నిజానికి అనసూయ భరద్వాజ్, విజయ్ దేవరకొండ మధ్య వివాదం ఇప్పుడు మొదలైంది కాదు. 'అర్జున్ రెడ్డి' ప్రమోషన్స్ లో పబ్లిక్ స్టేజ్ మీద "ఏం మాట్లాడుతున్నావ్ రా మాదర్ ***" అనే డైలాగ్ చెప్పడంపై అనసూయ బహిరంగంగానే విమర్శలు చేసింది. దీనిపై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అప్పటినుంచి వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. మధ్యలో విజయ్'D నిర్మించిన 'మీకు మాత్రమే చెప్తా' అనే సినిమాలో అనసూయ నటించడంతో అంతా సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ లైగర్ టైంలో మరోసారి అనసూయ మళ్లీ కాంట్రవర్సీ తీసుకొచ్చింది.
 
విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మారిన తరుణంలో, అనసూయ ట్వీట్ చేస్తూ 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!' అంటూ ఇన్ డైరెక్ట్ గా ట్రోల్ చేసింది. ఇప్పుడు ఖుషి పోస్టర్ పైనా పరోక్షంగా ట్వీట్ పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. VD ఫ్యాన్స్ కామెంట్లు చూస్తుంటే, ఈ విషయాన్ని ఇప్పుడప్పుడే మర్చిపోయేలా కనిపించడం లేదు. మరి ఇది ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.
Published at : 06 May 2023 07:47 AM (IST) Tags: Anasuya bharadwaj Kushi Anasuya tweets Anasuya targets VD Vijay Deavarakonda The Vijay Deavarakonda

సంబంధిత కథనాలు

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్‌ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!

Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్‌ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

టాప్ స్టోరీస్

Sharmila Meet Sivakumar : మరోసారి డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ - కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

Sharmila Meet Sivakumar  : మరోసారి డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ -  కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి