అన్వేషించండి

Tantra Trailer: ఆసక్తికరంగా ‘తంత్ర’ ట్రైలర్ - ఇంతకీ తాంత్రిక సాధన చేసిన ఆ తెలుగు ముఖ్యమంత్రి ఎవరు?

Tantra Movie: అనన్య నాగళ్ల లీడ్ రోల్‌లో నటిస్తున్న హారర్ చిత్రమే ‘తంత్ర’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యింది. చైతబడి ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Tantra Movie Trailer Out Now: టాలీవుడ్‌లో ఔట్ అండ్ ఔట్ హారర్ సినిమాలకు ఈమధ్య క్రేజ్ బాగా పెరిగిపోతోంది. అదే తరహాలో త్వరలోనే మరో హారర్ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. అదే ‘తంత్ర’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. చేతబడి, వశీకరణ లాంటి అంశాలతో సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అనన్య నాగళ్ల లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘తంత్ర’ ట్రైలర్ చూడడానికే చాలా భయంకరంగా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ట్రైలర్ మొత్తం ఇంట్రెస్టింగ్‌గా కొనసాగేలా చేసి చివరి డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు..

టాలీవుడ్‌లో హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువమంది తెలుగమ్మాయిలలో అనన్య నాగళ్ల కూడా ఒకరు. తను హీరోయిన్‌గా ఒకట్రెండు చిత్రాల్లో నటించినా.. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రకే ఎక్కువగా గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత తనకు అవకాశాలు కూడా పెరిగాయి. ప్రస్తుతం అనన్య చేతిలో దాదాపు నాలుగు తెలుగు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘తంత్ర’. చేతబడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమవుతోంది. అసలు సినిమా కథ ఏంటి అని ట్రైలర్‌లోనే పూర్తిగా బయటపెట్టారు మేకర్స్. ఇందులో హీరోయిన్ సలోని కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది.

తాంత్రికురాలిగా రీఎంట్రీ..

‘తంత్ర’లో హీరోయిన్‌గా అనన్య నాగళ్ల నటించగా.. హీరోగా ధనుష్ రఘుముద్రి కనిపించాడు. ఇంత చేతబడి చేసే తాంత్రికుడి పాత్రలో టెంపర్ వంశీ నటించగా.. ఇతర కీలక పాత్రలో మీసాల లక్ష్మణ్ అలరించనున్నట్టు తెలుస్తోంది. బాత్రూమ్‌లో తనకు మాత్రమే కనిపించే ఒక దెయ్యాన్ని చూసి అనన్య భయపడడంతో ‘తంత్ర’ ట్రైలర్ మొదలవుతుంది. చాలాకాలం తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్న సలోని.. ఈ సినిమాలో ఒక తాంత్రికురాలి పాత్ర పోషించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ట్రైలర్ చివర్లో ‘‘అప్పట్లో ఒక తెలుగు ముఖ్యమంత్రి కూడా ఈ తాంత్రిక సాధన చేశారని బాగా పుకార్లు వచ్చాయి’’ అనే డైలాగ్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nivriti Vibes (@nivritivibes)

ప్రతీ అప్డేట్‌లో క్రియేటివిటీ..

‘తంత్ర’పై ప్రేక్షకులను ఆసక్తిని కలిగించడం కోసం ఇందులోని ప్రతీ అప్డేట్‌ను క్రియేటివ్‌గా అందించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ట్రైలర్ అనౌన్స్‌మెంట్‌ను కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ‘ప్రతీ పౌర్ణమికి రక్తం తాగే పిశాచి వస్తోంది’ అంటూ పౌర్ణమి రోజే ‘తంత్ర’ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చిందనే విషయం చెప్పడం కోసం ‘పిల్లబచ్చాలు రావొద్దు. ఎందుకంటే మాది ‘ఏ’ సినిమా’ అని పోస్టర్‌ను విడుదల చేశారు. ఇలా ఎప్పటికప్పుడు ప్రతీ అప్డేట్‌తో సినిమాపై ప్రేక్షకులను ఆసక్తి పెంచుతూనే ఉంది ‘తంత్ర’ టీమ్. మార్చి 15న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ హారర్ సినిమా అనన్య నాగళ్లతో పాటు సలోనికి కూడా కమ్ బ్యాక్ మూవీ అవుతుందేమో చూడాలి.

Also Read: ఆర్జీవీ డెన్‌లో ‘సర్కార్’ ఏం చేస్తున్నాడబ్బా? ఇంతకీ వీళ్ళ ‘వ్యూహం’ ఏంటి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Maruti Dzire Sales: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
Crime News: 'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
Jio vs Airtel vs Vi vs BSNL: రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget