Epic First Semester Glimpse : 90s బయోపిక్ సీక్వెల్ మూవీ 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' - టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది
Epic First Semester : 90s బయోపిక్ ఫేం ఆదిత్య హాసన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్న మూవీ 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా నటించిన మూవీ టైటిల్ గ్లింప్స్ తాజాగా రిలీజ్ చేశారు.

Anand Deverakonda's Epic First Semester Title Glimpse Out : '90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'... ఈ వెబ్ సిరీస్ ప్రతీ మిడిల్ క్లాస్ ఆడియన్ మనసును టచ్ చేసింది. ఆదిత్య హాసన్ రూపొందించిన ఈ సిరీస్‌లో రోల్స్ ఎప్పటికీ స్పెషల్. ముఖ్యంగా 'సాంప్రదాయినీ... సుప్పినీ... సుద్ధపూసనీ' అనే పేరడీ సాంగ్ వచ్చినప్పుడు ఆదిత్య ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ వేరే లెవల్. ఈ సిరీస్‌లో రోల్స్‌తో సీక్వెల్‌గా వస్తోన్న మూకి 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' టైటిల్ ఫిక్స్ చేశారు.
టైటిల్ గ్లింప్స్ అదుర్స్
'బేబీ' మూవీతో హిట్ పెయిర్ అనిపించుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా... '90s వెబ్ సిరీస్' ఫేం ఆదిత్య హాసన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది. మాస్టర్ డిగ్రీ అందుకున్న తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్స్‌తో తనకు కాబోయే వాడి గురించి ఎలివేషన్ ఇస్తుండగా హీరోగా ఆనంద్ ఎంట్రీ అదిరిపోయింది. తనకు కాబోయే అబ్బాయి క్వాలిటీ చెప్తుండగా... '90s బయోపిక్'లో ఆదిత్య రోల్ బ్యాక్ గ్రౌండ్ చూపించారు.
'ఇది శేఖర్ కమ్ముల సినిమాలో హీరోలాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీ' అంటూ హీరో ఆనంద్ చెప్పే డైలాగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. '90s' వెబ్ సిరీస్‌లో రోహన్ పోషించిన ఆదిత్య పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్ర ప్రయాణాన్ని కొనసాగిస్తూ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటం విశేషం. ఆయన ఈ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ మూవీలో ప్రతీ సీన్ ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని హీరో ఆనంద్ తెలిపాడు. 'ఆదిత్య పాత్రలో నన్ను నేను చూసుకున్నా. పేరెంట్స్ ఒత్తిడితో లండన్ వెళ్లిన ఆదిత్య లైఫ్‌లో ఏం జరిగింది? తెలుగులో పూర్తి స్థాయిలో రొమాంటిక్ సినిమాలు రావడం లేదు. ఆ లోటుని భర్తీ చేసేలా ఈ మూవీ ఉంటుంది. ఇది మన ఇంట్లో జరిగే కథ.' అని చెప్పాడు. ఇది యువతకు నచ్చే అందమైన లవ్ స్టోరీ అని హీరోయిన్ వైష్ణవి తెలిపింది.
చిన్న కథలను తీసుకుని... వాటిని అందంగా తెరపైకి తీసుకురావడం తనకు చాలా ఇష్టమని డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెలిపాడు. ఎపిక్ మూవీ ఓ మిడిల్ క్లాస్ యువకుడి లవ్ స్టోరీ అని... మూవీ చూసేటప్పుడు ప్రతీ ఒక్కరూ తమను తాము ఊహించుకుంటారని... ప్రతీ సీన్ మీకు నచ్చుతుందని చెప్పాడు.
ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే...
ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమేనని అందుకే 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' టైటిల్ పెట్టినట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. దీనికి సీక్వెల్ కూడా ఉంటుంది. '90s వెబ్ సిరీస్ చూసి ఆదిత్య హాసన్‌తో ఓ సినిమా చేయాలి అనుకున్నాం. ఆదిత్య వచ్చి ఈ రొమాంటిక్ కామెడీ కథ చెప్పగానే.. వెంటనే చేయాలనుకున్నాను. నేను వ్యక్తిగతంగా ఈ తరహా చిత్రాలకు పెద్ద అభిమానిని. ఒక మంచి సినిమా చేశాము.' అని అన్నారు. ఈ చిత్రం త్వరలో భారీస్థాయిలో విడుదల కానుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, రచన, దర్శకత్వం: ఆదిత్య హాసన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, ఛాయాగ్రహణం: అజీమ్ మహమ్మద్, కూర్పు: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె వర్మ, సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, వీఎంఆర్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, నిర్మాణ సంస్థలు: సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.





















