Samantha Raj Nidimoru Marriage : సమంత రాజ్‌ల వివాహం - హీరోయిన్ పూనమ్ ట్వీట్ వైరల్... పరోక్షంగా అలా అనేసిందేంటి?
Poonam Kaur Reaction : ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్ పూనమ్ కౌర్ తాజా ట్వీట్ వైరల్ అవుతోంది. ఆమె సమంత రెండో పెళ్లిని ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారంటూ నెట్టింట చర్చ నడుస్తోంది.

Poonam Kaur Post Gone Viral Indirect Counter On Samantha Raj Nidimoru Marriage Celebration : స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోర్‌ల వివాహం సోమవారం కోయంబత్తూర్ ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయం వద్ద జరిగిన సంగతి తెలిసిందే. సమంత ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్, నెటిజన్లు కొత్త జంటకు విషెష్ చెబుతున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కాగా... హీరోయిన్ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
పూనమ్ ఏం పోస్ట్ చేశారంటే?
సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిన పడగొట్టడం బాధాకరం అంటూ పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'ఈ అహంకార పూరిత మహిళను పెయిడ్ పీఆర్ గొప్పగా చూపిస్తున్నారు. బలహీనమైన, నిరాశ చెందిన పురుషులను డబ్బుతో కొనుగోలు చెయ్యొచ్చు.' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. సమంత, రాజ్‌ల వివాహాన్ని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ చేశారంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఎవరి వ్యక్తిగత జీవితం వారిదని... ఒకరి నిర్ణయాలను తప్పుబట్టే అధికారం మనకు లేదని మరికొందరు హితవు పలుకుతున్నారు.
Broke a home to create your own - sad 💔
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 1, 2025
The empowered ,educated and Narcissistic woman - who are glorified through Paid PR campaigns 🤮
Money can buy weak and desperate men.
Also Read : సమంత రాజ్‌ల వెడ్డింగ్ - అసలెవరీ రాజ్ నిడిమోరు?... స్టార్ డైరెక్టర్‌గా ఎలా ఎదిగాడంటే?
గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పైనా పూనమ్ ఆరోపణలు చేశారు. ఆయన్ను వదిలేది లేదని... ఈ మెయిల్ ద్వారా కూడా కంప్లైంట్ చేస్తానంటూ అప్పట్లో ఆమె చెప్పడం సంచలనం కలిగించింది. అయితే, సోమవారం తెల్లవారుజాము నుంచి సమంత, రాజ్‌ల పెళ్లి వార్తలు వైరల్ అవుతుండగా... రాజ్ మాజీ భార్య శ్యామాలిదే చేసిన పోస్ట్ ఆ న్యూస్‌కు బలం చేకూర్చింది. 'తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు' అంటూ ఆమె ఇన్ స్టాలో రాసుకొచ్చారు. దీంతో వీరి పెళ్లి కన్ఫర్మ్ అనే ప్రచారం సాగింది. అందుకు తగినట్లుగానే సమంత మధ్యాహ్నం ఇద్దరి పెళ్లి ఫోటోలు షేర్ చేశారు.





















