అన్వేషించండి

Amma Nanna o Tamila Ammayi Sequel: 15 ఏళ్ల తర్వాత ‘అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి’ సీక్వెల్ - కానీ, ఓ ట్విస్ట్!

Amma Nanna o Tamila Ammayi Sequel: ర‌వితేజ‌, పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి’. తాజాగా మూవీ సీక్వెల్ కు రెడీ అవుతోంది.

Amma Nanna o Tamila Ammayi Sequel: తెలుగు సినిమా పరిశ్రమలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ లో ఒకటి ‘అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి’.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. 2003లో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ సినిమా  రవితేజ కెరీర్‌ను మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలోని పాటలు, డైలాగులు, ఫైట్స్ అన్నీ సూపర్‌ హిట్ అయ్యాయి. మ‌ద‌ర్‌ సెంటిమెంట్‌కు బాక్సింగ్ బ్యాక్‌ డ్రాప్‌ను జోడించి ,ద‌ర్శ‌కుడు పూరి ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు. ఈ యాక్షన్ రోమాంటిక్ చిత్రంలో అసిన్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, జయసుధ, అలీ, సుబ్బరాజు, ఐశ్వర్య, ధర్మవరపు సుబ్రమణ్యం, జునియర్ రేలంగి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరాలు సమకూర్చారు.    

‘ఎం. కుమ‌ర‌న్ స‌న్నాఫ్ మ‌హాల‌క్ష్మి’ పేరుతో తమిళంలో రీమేక్

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత తమిళంలో రీమేక్ అయ్యింది. ‘ఎం. కుమ‌ర‌న్ స‌న్నాఫ్ మ‌హాల‌క్ష్మి’ పేరుతో ఈ సినిమా తమిళంలో రూపొందింది. మోహ‌న్‌ రాజా ఈ తమిళ రీమేక్ కు దర్శకత్వం వహించారు. అక్కడ ఈ సినిమాలో హీరోగా జయం రవి నటించారు.  త‌మిళ వెర్ష‌న్‌లోనూ  హీరోయిన్ గా అసిన్ న‌టించింది. తెలుగులో జయసుధ పోషించిన పాత్రలో తమిళంలో న‌దియా నటించింది.  సుమారు 15 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో నదియా తమిళ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ రీమేక్ ఆమెకు మంచి కమ్ బ్యాక్ గా నిలిచింది. ఆ తర్వాత తనకు వరుస అవకాశాలు వచ్చాయి.

‘ఎం. కుమ‌ర‌న్ స‌న్నాఫ్ మ‌హాల‌క్ష్మి2’ పేరుతో సీక్వెల్

తాజాగా ‘ఎం. కుమ‌ర‌న్ స‌న్నాఫ్ మ‌హాల‌క్ష్మి’ సినిమా సీక్వెల్ కు సంబంధించి దర్శకుడు మోహన్ రాజా కీలక విషయాలు వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా సీక్వెల్ గురించి స్పందించారు. ‘ఎం కుమ‌ర‌న్ స‌న్నాఫ్ మ‌హాల‌క్ష్మి 2’ పేరుతో ఈ సినిమా సీక్వెల్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ సీక్వెల్ కు సంబంధించిన కథ కంప్లీట్ అయినట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిపారు. ఈ సీక్వెల్‌ లో కూడా జ‌యం ర‌వి హీరోగా చేయబోతున్నట్లు చెప్పారు. అయితే, నదియా పాత్ర మాత్రం సీక్వెల్ లో ఉండబోదని మోహన్ తెలిపారు. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక మోహ‌న్‌ రాజా రీసెంట్ గా  చిరంజీవితో కలిసి ‘గాడ్‌ ఫాద‌ర్’ అనే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత అక్కినేని నాగార్జున‌, అఖిల్ తో కలిపి మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేశారు. అయితే, స్క్రిప్ట్ అనుకున్నట్లుగా రాకపోవడంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయినట్లు టాక్ వచ్చింది. ఈ మల్టీ స్టారర్ మూవీని కాస్త పక్కన పెట్టి, ‘అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి’ తమిళ మూవీ సీక్వెల్ చేయ‌బోతున్న‌ట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Read Also: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కలిసిన కంగనా, అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget