అన్వేషించండి

Kangana Ranaut: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కలిసిన కంగనా, అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా?

Kangana Ranaut: కంగనా రనౌత్ తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ప్రస్తుతం ఈ మూవీ పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నది. త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో కంగనా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Kangana Ranaut Interacts With Indira Gandhi: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమాలో ఆమె దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కనిపించబోతున్నారు. కంగన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్నది. ప్రస్తుతం పోస్టు ప్రొక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో ఈ మూవీ  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఇందిరాతో కంగనా చిట్ చాట్

కంగనా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలో, ఆమె మాజీ ప్రధాని ఇందిరాతో కూర్చున్నట్లుగా ఉంది. వారిద్దరూ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ కంగనా ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. లేటెస్ట్ ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీతో ఈ ఫోటో తీసినట్లు తెలిపారు. “ఐజీ(ఇందిరా గాంధీ)తో చాట్ చేయడం చాలా ఆనందంగా ఉంది” అంటూ కంగనా ఈ ఫోటోను షేర్ చేశారు. కంగనా తాజా చిత్రంలో  ఇందిరా గాంధీ పాత్రకు చిత్రబృందం ఐజీ అని పేరు పెట్టింది. అటు ప్రధాని మోదీతో కూర్చొని చర్చిస్తున్నట్లుగా ఉన్న ఫోటోను కూడా కంగనా షేర్ చేశారు. ఢిల్లీలోని ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఈ ఫోటోలను తీసినట్లు ఆమె తెలిపారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సందర్శించిన కంగనా

దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు సంబంధించిన వివరాలతో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో తాజాగా ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. దీనికి  ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ అని పేరు పెట్టింది. ఇందులో సదరు ప్రధానులకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరిచారు. తాజాగా ఈ కేంద్రాన్ని కంగనా సందర్శించారు. వీరాంగనా కీ మహాగాథ పేరుతో  పేరిట ఏర్పాటు చేసిన  లైట్‌ అండ్ సౌండ్‌ షోలో ఆమె పాల్గొన్నారు. “పురాతన, ఆధునిక విధానాల ద్వారా చరిత్రలోని అనేక అధ్యాయాలు ఈ షో ద్వారా చూపించారు. కుటుంబ సమేతంగా వచ్చి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందవచ్చు” అని కంగనా ఈ షో గురించి వెల్లడించారు.   

ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎమర్జెన్సీ’

కంగనా రనౌత్‌  స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ సినిమా రూపొందుతోంది. దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘మణికర్ణిక’ తర్వాత ఆమె ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.   మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ పై రేణు పిట్టితో కలిసి కంగనా రనౌత్ ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమాలో దివంగత నటుడు సతీష్ కౌశిక్, అనుపమ కేర్, శ్రేయస్ తల్పడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Read Also: లయ, నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం, ఆ కారణంతో ఆగిపోయింది: సాయి కిరణ్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget