Kalki 2898 AD Ratings : అమితాబ్, కమల్ పాత్రలు ప్రభాస్‌ను డామినేట్ చేశాయా? ‘కల్కి 2898 AD’పై నేషనల్ మీడియా రివ్యూలు ఇవే - అక్కడ హిట్టా, ఫట్టా?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు విజువల్ వండర్ గా తీర్చిదిద్దారనే టాక్ వినిపిస్తోంది.
Kalki 2898 AD Movie: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 AD‘ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. పురాణాలను ఆధునికి కాలానికి జోడిస్తూ నాగ్ అశ్విన్ చేసిన విజువల్ మ్యాజిక్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారీ బడ్జెట్, స్టార్ యాక్టర్లు, 4 సంవత్సరాల కష్టానికి తగిని ప్రతిఫలం దక్కిందంటున్నారు.
హాలీవుడ్ మూవీని తలదన్నేలా ‘కల్కి 2898 AD‘
ఇక ‘కల్కి 2898 AD‘ సినిమా హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉందనే టాక్ వినిపిస్తోంది. భారతీయతతో నిండిన కథతో నాగ్ అశ్విన్ ప్రపంచ స్థాయి సినిమా రూపొందించారంటున్నారు. కళ్లు చెదిరే విజువల్ ట్రీట్, అద్భుతమైన కథ, ఒకదానిని మించి మరొక పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో మేజిక్ చేశారంటూ పొగుడుతున్నారు. హాలీవుడ్ సినిమాల మాదిరిగా ఉండే క్యారెక్టర్లు, ఊహా జనిత ప్రపంచాలు ఉన్నప్పటికీ మన పురాణాలను బేస్ చేసుకుని కథ నడిపిన విధానం అద్భుతం అంటున్నారు.
ప్రభాస్, దీపికా పదుకొణె పాత్రలను డామినేట్ చేశాయా?
మహాభారతంలోని కురేక్షేత్ర సంగ్రామంతో మొదలైన ఈ సినిమా ఆ తర్వాత ప్రేక్షకులను ఊహించని ప్రపంచలోకి తీసుకెళ్తుందంటున్నారు. ఈ సినిమాలో హీరోయిజాన్ని చూపించకుండా కథకు ఇంపార్టెన్స్ ఇస్తూ నాగ్ అశ్విన్ సినిమాను ముందుకు నడిపిన విధానం అద్భుతం అంటున్నారు. మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే ఈ కథ దేనికదే ప్రత్యేకంగా చూపించడం నిజంగా వండర్ అంటున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె పాత్రలు తీర్చి దిద్దిన విధానం మరో లెవెల్ లో ఉందంటున్నారు.
అయితే, ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్రలతో పోల్చితే, అమితాబ్, కమల్ పాత్రలే అద్భుతంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ వయసులో అమితాబ్ చేసే విన్యాసాలు సినిమాకే హైలెట్ గా నిలిచాయంటున్నారు. ప్రభాస్ కు దీటుగా ఆయన ఈ చిత్రంలో నటించారని చెప్తున్నారు. వైజయంతి మూవీ సంస్థ 50 ఏళ్ల ప్రయాణంలో ‘కల్కి 2898 AD‘ ఓ కలికితురాయిగా సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.
నేషనల్ మీడియా ఏం అంటుందంటే?
జాతీయ మీడియా కూడా ‘కల్కి 2898 AD‘ సినిమాను విజువల్ వండర్ గా అభివర్ణిస్తోంది. సినిమా అక్కడక్క కాస్త స్లో అయినట్లు అనిపించినా, చివరికి వచ్చే సరికి నాగ్ అశ్విన్ మ్యాజిక్ చేశారని చెప్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అభిప్రాయపడుతోంది.
‘కల్కి 2898 AD‘ చిత్రానికి జాతీయ మీడియా రేటింగ్
❤ ABP Live: 3/5
❤ Indian Express: 2.5/5
❤ Times Of India: 3.8/5
❤ India today: 3.5/5
❤ News 18: 4/5
Read Also: 'కల్కి 2898 ఏడీ' రివ్యూ: విజువల్ వండరే! మరి, 'బాహుబలి' బీట్ చేసే సత్తా ఉందా?