అన్వేషించండి

Amitabh Bachchan: కూతురికి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన అమితాబ్ - కోట్లు విలువ చేసే బంగ్లా బహుమతిగా!

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ ఎంతోకాలం నివసించిన ‘ప్రతీక్ష’ బంగ్లాను కూతురు శ్వేతా నందకు గిఫ్ట్ ఇచ్చారు. ఆ బంగ్లా విలువ ఎంతో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

Amitabh Bachchan Daughter : సినీ సెలబ్రిటీలు తమ వారసులకు ఇచ్చే గిఫ్ట్స్ విలువ చాలావరకు కోట్లలోనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్‌లో బిగ్ బీగా పేరు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ కూడా తన కూతురుకు ఒక స్పెషల్ గిఫ్ట్ అందించారని టాక్ వినిపిస్తోంది. తను ఎంతోకాలం ఉన్న ఇల్లును కూతురి పేరుపై మార్చేశాడట అమితాబ్. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయని సమాచారం. అమితాబ్ కూతురు శ్వేతా నందకు అందిన ఈ బంగ్లా విలువ తెలిసి బాలీవుడ్ ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.

మొత్తం మూడు ఇల్లులు..
అమితాబ్ బచ్చన్‌కు ముంబాయ్‌లోని జుహూలో దాదాపు మూడు ఇల్లులు ఉన్నాయి. అందులో ఒకటి ‘ప్రతీక్ష’. నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన సమయంలో చాలా ఏళ్లపాటు ప్రతీక్షలోనే తన ఫ్యామిలీతో కలిసి నివసించారు అమితాబ్. దాంతోపాటు జుహూలోనే ‘జల్సా’, ‘జనక్’ అనే మరో రెండు ఇల్లులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అమితాబ్.. తన కుటుంబంతో కలిసి ‘జల్సా’లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే తను ఇష్టంగా చూసుకున్న ప్రతీక్ష బంగ్లాను తాజాగా తన కూతురు శ్వేతా నందకు గిఫ్ట్‌గా రాసి ఇచ్చేశారట బిగ్ బి. 

బంగ్లా విలువ ఎన్ని కోట్లంటే..?
జుహూలోని విఠల్‌నగర్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీలో రెండు ప్లాట్స్‌లో ప్రతీక్షను కట్టారు అమితాబ్ బచ్చన్. అందులో ఒక ప్లాట్ 674 చదరపు మీటర్లు ఉండగా.. మరొక ప్లాట్ 890.47 చదరపు మీటర్లు ఉంటుంది. అయితే ఈ బంగ్లా విలువ దాదాపు రూ.50.63 కోట్లు విలువ ఉంటుందని సమాచారం. నవంబర్ 8న రెండు వేర్వేరు గిఫ్ట్ డీడ్స్‌ను సిద్ధం చేసి ప్రతీక్షను శ్వేత నందా పేరు మీద మార్చారట అమితాబ్. అంతే కాకుండా దీనికోసం రూ.50.65 లక్షల స్టాంప్ డ్యూటీని కూడా రెజిస్ట్రేషన్ కోసం అందించారట. అమితాబ్ బచ్చన్‌కు ఇద్దరు వారసులు ఉండగా.. అందులో అభిషేక్ బచ్చన్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు. ఇక కూతురు శ్వేతా నందా.. రచయితగా, బిజినెస్‌మ్యాన్‌గా తన పర్సనల్ లైఫ్‌గా బిజీ అయిపోయింది. ‘ప్యారడైజ్ టవర్స్’ అనే నవలను రచించి తనలోని రైటర్‌ను బయటపెట్టింది శ్వేతా. శ్వేతా నంద ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయినా తన పిల్లలు మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటూ ఫాలోవర్స్‌కు దగ్గరగా ఉంటారు. 

అమితాబ్ మనవడు, మనవరాలు..
ఇప్పటికే శ్వేతా నందా కూతురు నవ్య నవేలీ నందా.. నటిగా బాలీవుడ్‌లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం బిజినెస్ ఉమెన్‌గా వ్యాపారంలో ఒడిదొడుకులు నేర్చుకుంటున్న నవ్య.. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. తనకంటూ సొంతంగా ఒక పోడ్‌కాస్ట్ ఛానెల్ కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక నవ్యకంటే ముందే తన సోదరుడు అగస్థ్య నంద.. నటుడిగా డెబ్యూ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘ది ఆర్కైవ్స్’లో నటించాడు అగస్థ్య. డిసెంబర్ 7న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ యూజర్ల ముందుకు రానుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఫోటోషూట్స్‌తో తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకునే నవ్య నవేలి డెబ్యూ కోసం కూడా అమితాబ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అమితాబ్ తన కూతురికి గిఫ్ట్‌గా ఇచ్చిన బంగ్లా విలువతో హైదరాబాద్ శివారులో ఓ పాతిక విల్లాలు కొనేయొచ్చు అనుకుంటున్నారు నెటిజన్స్.

Also Read: సింపుల్ గా ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ హీరోయిన్ పెళ్లి, వరుడు ఎవరో తెలుసా?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Weather In AP, Telangana: 125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Weather In AP, Telangana: 125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
SSC Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్, ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో 'మోడల్ ఓఎంఆర్‌' పత్రాలు
టెన్త్ విద్యార్థులకు అలర్ట్, ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో 'మోడల్ ఓఎంఆర్‌' పత్రాలు
Low Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? - మీ సిబిల్‌ మీటర్‌ పెంచే మ్యాటర్‌ ఇదిగో!
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? - మీ సిబిల్‌ మీటర్‌ పెంచే మ్యాటర్‌ ఇదిగో!
Amritha Aiyer:  శారీ సింపిల్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంటే అదిరిపోతుంది!
శారీ సింపిల్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంటే అదిరిపోతుంది!
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
Embed widget