Amitabh Bachchan: కొడుకుతో కలిసి 'కల్కీ 2898 ఏడీ' చూసిన అమితాబ్ - అభిషేక్ బచ్చన్ రివ్యూ ఏంటంటే?
Amitabh Bachchan: 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో అశ్వథామగా అమితాబ్ అందరినీ ఆకట్టుకున్నారు. స్క్రీన్ పై ఆయన యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఇప్పుడు అమితాబ్ తన కొడుకుతో కలిసి సినిమా చూశారు.

Amitabh Bachchan watches Kalki 2898 AD with Abhishek Bachchan: సినీ ప్రపంచంలో 'కల్కీ 2898 ఏడీ' ఒక ప్రభంజనం. తెలుగు సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా అంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో అశ్వథామగా నటించారు. ఆ పాత్రలో ఆయన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన ఫైట్స్, ఆహార్యం ప్రతి ఒక్కటీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా సినిమా చూశారట. తన కొడుకుతో కలిసి సినిమా చూశాను అంటూ ఆయన తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.
అభిషేక్ బచ్చన్ ఏమన్నారంటే?
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజైన నాలుగు రోజులకి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఐమ్యాక్స్ ముంబైలో సినిమా చూశారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా బ్లాగ్ లో చెప్పారు. అభిషేక్ బచ్చన్ కూడా అమితాబ్ తో కలిసి సినిమా చూసి తన రివ్యూని ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. 'కల్కీ 2898ఏడీ'.. వావ్! జస్ట్ మైండ్ బ్లోయింగ్ అంటూ ట్వీట్ చేశారు అభిషేక్. అమితాబ్, అభిషేక్ ఇద్దరు కలిసి సినిమా చూస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చాలా రోజుల తర్వాత చూస్తున్నాను..
అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంటారు. అలా తను సినిమా చూసిన ఎక్స్ పీరియెన్స్ గురించి రాసుకొచ్చారు. ప్రతి ఆదివారం రొటీన్ లో భాగంగా తన ఇంటి ముందు ఉన్న ఫ్యాన్స్ కలిసిన తర్వాత అమితాబ్ బచ్చన్ సినిమా వెళ్లారు. “ సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి బిగ్ స్క్రీన్ మీద సినిమా చూశాను. అందరితో కలిసి చూడటం మొదటిసారి. అది కూడా ఐమ్యాక్స్ లో. సౌకర్యాలు, ఎన్విరాన్ మెంట్ బాగా నచ్చింది. బయటికి వచ్చి సినిమా చూసి చాలా రోజులు అయ్యింది. కానీ, ఈ అనుభూతి చాలా బాగుంది. అది కూడా నా కొడుకు నన్ను ఆటపట్టిస్తుంటే బాగుంది. నేను అభిషేక్ చేసిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ యాడ్ అవన్నీ బాగా అనిపించాయి” ఆయన మూవీ చూసిన విషయం అభిమానులతో పంచుకున్నారు అమితాబ్ బచ్చన్.
ఈ వయసులో అదరగొట్టిన బచ్చన్..
'కల్కీ 2898 ఏడీ'లో అమితాబ్ బచ్చన్ నిజంగా అదరగొట్టాడు. ఆయన అద్భుతమైన నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ వయసులో ఆయన డెడికేషన్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. కారణం.. ఆయన చేసిన ఫైట్లు. హీరోతో సమానంగా, నిజం చెప్పాలంటే ఒకింత ఎక్కువే అశ్వథామకు ఫైట్లు ఉన్నాయి ఈ సినిమాలో. వాటిని ఎంతో అద్భుతంగా చేశారు అమితాబ్. ఇక ఆయన గెటప్, ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి పార్ట్ - 2లో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు అందరూ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఇప్పటికే సినిమా పార్ట్ - 2 షూటింగ్ 60 శాతం పూర్తైనట్లు సినిమా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ప్రకటించారు.
Also Read: బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ షురూ, హీరోయిన్ ఎవరో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

