అన్వేషించండి

Sreenivas Bellamkonda: బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ షురూ, హీరోయిన్ ఎవరో తెలుసా?

చాలా గ్యాప్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా చేస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది.

Sreenivas Bellamkonda New Movie: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆయన సాగర్ కె చంద్రతో కలిసి ‘టైసన్ నాయుడు’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే ‘BSS 11’ పేరుతో మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రింగుల జుట్టు ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే వీళ్లిద్దరు కలిసి నటించిన ‘రాక్షసుడు’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మరోసారి జోడీ కడుతున్నారు.

అన్నపూర్ణ స్టూడియోలో పూజా వేడుక

తాజాగా ‘BSS 11’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ వేడుక నిర్వహించారు. సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా, పూజా కార్యక్రమంతో ప్రారంభం అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. శ్రీరామ నవమి సందర్భంగానే ఈ సినిమాను అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్. హారర్ మిస్టరీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ క్యారెక్టర్లు గతంలో ఎప్పుడూ లేనంత ఉత్కంఠను కలిగిస్తాయని మేకర్స్ వెల్లడించారు. బెల్లంకొండ సరికొత్త లుక్ లో కనిపించనున్నట్లు దర్శకుడు  వివరించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreenivas bellamkonda (@sreenivasbellamkonda)

జులై 11 నుంచి రెగ్యులర్ షూటింగ్

‘BSS 11’ సినిమా షూటింగ్ జులై 11 నుంచి ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహు గార‌పాటి నిర్మిస్తున్నారు. బి. అజనీష్ లోక్‌ నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు.  చిన్మయ్ సలాస్కర్ డీఓపీగా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను మనీషా ఎ దత్ చూసుకుంటున్నారు. ఆర్ట్ డైరెక్టర్ డి శివ కామేష్ ఉండగా,  ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే పని చేయనున్నారు.  

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘గ‌రుడ‌న్’ రీమేక్‌?

మరోవైపు త‌మిళ ఇండస్ట్రీలో బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ‘గ‌రుడ‌న్’ రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ కొనుగోలు చేశారు. ఈ సస్పెన్స్  క్రైమ్ థ్రిల్లర్ మూవీని విజయ్ కనకమేడల తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో  మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే తమిళ మూవీని తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టిన బెల్లంకొండ, ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ‘గ‌రుడ‌న్’ సినిమా 2024లో తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 50 కోట్లకు పైగా సాధించింది. 

Read Also: ‘బాడ్ న్యూస్’ ప్రమోషన్ లో ‘యానిమల్’ బ్యూటీ రియాక్షన్ - ‘నేషనల్ క్రష్’ కామెంట్స్ పై ఏం చెప్పిందో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
Embed widget