అన్వేషించండి

Christian Oliver: విమాన ప్రమాదంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్, తన ఇద్దరు కూతుళ్లు దుర్మరణం

Plane Crash: అమెరికన్ టీవీ సిరీస్‌లతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిస్టియర్ ఒలివర్.. ప్లెయిన్ క్రాష్‌లో మరణించాడు. తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు కూడా ఈ ప్రమాణంలో మృతిచెందారు.

Christian Oliver Plane Crash: అమెరికన్ నటుడు క్రిస్టియన్ ఒలివర్.. ఒక ప్లెయిన్ క్రాష్‌లో మరణించాడు. తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు కూడా అదే ప్లెయిన్‌లో ఉన్నారు. సెయింట్ విన్సెంట్ పోలీసులు చెప్పినదాని ప్రకారం.. తూర్పు కారేబియన్ దగ్గర ఉన్న ఒక చిన్న ప్రైవేట్ ఐల్యాండ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఐల్యాండ్ నుండి సెయింట్ లూసియా వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు చెప్తున్నారు.

పైలెట్ కూడా మృతి..
తూర్పు కారేబియన్‌లోని బేకుయా దగ్గర పెటిట్ నెవిస్ అనే ఒక ఐల్యాండ్ ఉంది. క్రిస్టియర్ ఒలివర్.. ఆ ఐల్యాండ్ నుండి సెయింట్ లూసియా వెళ్లడానికి ప్రయాణమయ్యాడు. అదే సమయంలో తను ఉన్న ప్లెయిన్ క్రాష్ అయ్యి.. తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు కూడా మరణించారు. క్రిస్టియన్ ఒలివర్ పెద్ద కూతురు యానిక్ క్లెప్సర్‌కు 12 ఏళ్లు కాగా.. చిన్న కూతరు మడీటా క్లెప్సర్‌కు పదేళ్లు. ఈ ముగ్గురుతో పాటు విమానాన్ని నడుపుతున్న పైలెట్ రోబర్ట్ సాక్స్ కూడా ఈ ప్లెయిన్ క్రాష్‌లో మరణించినట్టు తెలుస్తోంది. అసలు ప్లెయిన్ క్రాష్ ఎందుకు జరిగింది అనే వివరాలు ఇంకా తెలియలేదని పోలిసులు చెప్తున్నారు.

మత్స్యకారులే ముందుగా చూశారు..
ముందుగా ఈ ప్లెయిన్ క్రాష్‌ను ఆ ఐల్యాండ్‌లో పనిచేసే మత్స్యకారులు చూశారు. చూసిన వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ కోస్ట్ గార్డ్.. ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నారు. ఏ భయం, స్వార్థం లేకుండా ప్లెయిన్ క్రాష్ అవ్వడం చూసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో చిక్కకున్న వారిని కాపాడే ప్రయత్నం చేసిన మత్స్యకారులను, డైవర్లను పోలీసులు ప్రశంసించారు. క్రిస్టియన్ ఒలివర్ మరణ వార్త విని ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. అసలు ఒలివర్ ఆ ఐల్యాండ్‌కు ఎందుకు వెళ్లాడు, ప్లెయిన్ క్రాష్‌కు కారణమేంటి వంటి విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

జర్మనీ వదిలేసి అమెరికాకు..
51 ఏళ్ల ఈ నటుడు.. 1994లో నటుడిగా హాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ముందుగా టీవీ సిరీస్‌లతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ‘సేవ్డ్ బై ది బెల్ - ది న్యూ క్లాస్’ అనే టీవీ సిట్‌కామ్ సిరీస్ నటుడిగా క్రిస్టియన్ ఒలివర్‌కు మంచి పేరు తీసుకురావడంతో పాటు మరిన్ని అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. ‘ది బేబి సిట్టర్స్ క్లబ్’ అనే సినిమాతో క్రిస్టియన్ ఒలివర్.. వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాలు, టీవీ సిరీస్‌లతో బిజీ అయ్యాడు. ఇక క్రిస్టియన్ ఒలివర్ చివరిగా ‘హంటర్స్’ అనే టీవీ సిరీస్‌లో నటుడిగా కనిపించాడు. గతేడాది విడుదలయిన ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ చిత్రానికి తన వాయిస్‌ను అందించాడు. వెస్ట్ జర్మనీలో పుట్టి పెరిగిన క్రిస్టియన్ ఒలివర్ నటుడు అవ్వాలనే కలతో అమెరికాలో అడుగుపెట్టాడు. ముందుగా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. లాస్ ఏంజెల్స్, న్యూయార్క్‌లాంటి సిటీల్లో నటుడిగా ట్రైనింగ్ తీసుకున్నాడు. జర్మనీకి చెందినవాడు కావడంతో ఇంగ్లీష్‌లో మాత్రమే కాకుండా తను జర్మన్ టీవీ సిరీస్‌లలో కూడా నటించాడు.

Also Read: దేవర ఆడియో @ బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget