Facts About Titanic: క్లాసిక్ మూవీ టైటానిక్... హీరోయిన్ గా ఆమెనే ఎందుకు ఎంపిక చేశారు?
టైటానిక్ సినిమా ఒక్కసారి కాదు వంద సార్లు చూసినా వారు కూడా ఉన్నారు. సినీ ప్రియులకు హాట్ ఫేవరేట్ మూవీ ఇదే.
టైటానిక్... చరిత్రలో ఓ విషాదం. ఆ విషాదానికే ప్రాణం పోసి సినిమాగా మార్చి చూపించాడు జేమ్స్ కామెరూన్ . 1997లో విడుదలైన ఈ సినిమా ఓ సెన్షెషనల్. దేశంతో, భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంది. జాక్ చనిపోయేటప్పుడు కన్నీరుగా కరగని గుండె లేదేమో. ఆ సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆ సినిమాకు, ఓడకు సంబంధించి కొన్ని వాస్తవాలు ఇవిగో...
1. హాలీవుడ్ నటి కేట్ విన్ స్లెట్ మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ టైటానిక్. ‘రోజ్’పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చుకుంది. ఈమె కన్నా ముందు మడోన్నా, షారోన్ స్టోన్, నికోలె కిడ్మెన్లకు ముందుగా ఆ ఛాన్సు వచ్చింది. కానీ కేట్ పదేపదే దర్శకుడు జేమ్స్ కామెరూన్ కు ఫోన్ చేసి ఆఫర్ ఇవ్వాల్సిందిగా అర్థించిందని టాక్. అంతేకాదు గులాబీ పూల గుత్తులను అతనికి బహుమతిగా పంపి ‘ఫ్రమ్ యువర్ రోజ్’ అని నోట్ కూడా పంపిందట. ఆమె ఆసక్తిని గమనించే జేమ్స్ ఆమెను రోజ్ పాత్రకు ఎంపిక చేసినట్టు చెబుతారు.
2. టైటానిక్ ఓడను తయారుచేయడానికి అయిన ఖర్చు కన్నా, సినిమా తీయడానికే ఎక్కువ ఖర్చయింది. ఓడను నిర్మించేందుకు అప్పట్లోనే ఏడున్నర మిలియన్ డాలర్లు ఖర్చవ్వగా, సినిమా తీయడానికి 200 మిలియన్ డాలర్లు ఖర్చయ్యింది.
3. టైటానిక్ లో ఉన్నది ఒకే ఒక్క పాట. దాన్ని రికార్డు చేసేప్పుడు దాదాపు అందరూ ఏడ్చారు.
4. 1995లో సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు జేమ్స్ కామెరూన్ 12 సార్లు సముద్రం అడుగుభాగానికి వెళ్లి మునిగిపోయిన టైటానిక్ ఓడను చూసి వచ్చాడు.
5. కేట్ విన్ స్లెట్ డ్రెస్ ను పొడిగా ఉన్నా, తడిసినా అందంగా కనిపించేలా ప్రత్యేకంగా రూపొందించారు.
6. టైటానిక్ కనిపించే సీన్లన్నీ నిజజీవితంలోని రోజ్ చెప్పినివి మాత్రమే కాదు, ఆ ఘోర ఘటనలో ప్రాణాలు దక్కించుకున్నవారందరితో మాట్లాడి స్క్రిప్ట్ లో జోడించినవే.
7. జాక్ చనిపోయే సీన్ లో రోజ్ ఓ చెక్క బల్లపై తేలుతూ ఉంటుంది. ఆ చెక్క పైకి చేరి జాక్ కూడా ప్రాణాలు దక్కించుకోవచ్చని చాలా మంది వాదించారు. కొంతమంది విద్యార్థులు ప్రయోగం కూడా చేసి చూపించారు. జేమ్స్ కామెరూన్ మాత్రం ‘జాక్ నిజజీవితంలో చనిపోయాడు అంతే...’ ఒక్క ముక్కతో తేల్చి చెప్పేశారు.
8. టైటానిక్ లో 3,500 మంది ప్రయాణించవచ్చు. 1912లో టైటానిక్ మునిగేటప్పుడు 2,200 మంది ప్రయాణికులు, వెయ్యి మంది షిప్ సిబ్బంది ఉన్నారు.
9. ఓడలో 4 రెస్టారెంట్లు, రెండు లైబ్రరీలు, రెండు సెలూన్లు, ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి.
10.1912 లో ఈ ఓడను 1985లో సెప్టెంబరు 1 న అట్లాంటిక్ సముద్రంలో దాదాపు 13,000 అడుగున గుర్తించారు.
Also read: ఈ నల్లకోడి ప్రత్యేకతలు తెలిస్తే.. తప్పకుండా గుటకలు వేస్తారు
Also read: అప్పట్లో ఆడవాళ్లకు రాచరికం అదృష్టం కాదు, ప్రసవ సమయంలో అలా...
Also read: గ్రీన్ టీ తాగే పద్ధతి ఇది... ఎప్పుడుపడితే అప్పుడు తాగేయకూడదు