Amala Paul: మీకు తెలుసా? నేనే కాదు.. నా భర్త కూడా ప్రెగ్నెంటే! అమలాపాల్ షాకింగ్ పోస్ట్
Amala Paul Interesting Post: తమిళ నటి, హీరోయిన్ అమలాపాల్ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాయ్‌ఫ్రెండ్, వ్యాపారవేత్త జగత్ దేశాయ్‌తో గతేడాది ఏడడుగులు వేసింది.
Amala Paul Interesting Post: తమిళ నటి, హీరోయిన్ అమలాపాల్ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాయ్‌ఫ్రెండ్, వ్యాపారవేత్త జగత్ దేశాయ్‌తో గతేడాది ఏడడుగులు వేసింది. కొద్దిమంది స్నేహితులు, బంధువుల సమక్షంలో నవంబర్ 5, 2023 వీరిద్దరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. పెళ్లయిన మూడు నెలలకే అమలాపాల్ గర్భం దాల్చింది. ఇటీవలే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. మాతృక్షణాలను ఆనందిస్టూ ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ కబుర్లను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఆ ఫొటోలను షేర్ చేస్తూ తన భర్తపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తను మాత్రమే కాదు తన భర్త కూడా ప్రెగ్నెంటే అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది.
సారీ.. హస్బెండ్!
బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన అమలాపాల్ తన భర్తను ఆటపట్టించింది. "మీకు తెలుసా? ప్రెగ్నెన్సీ సమయంలో ఒక పురుషుడి పొట్ట అతని భార్య పొట్టకు సమానంగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి! ఇప్పుడు ఆ అపోహలను తొలగించే సమయం ఇదే. నేను మాత్రమే గర్భవతిని కాదు.. నా భర్త కూడా. సారీ హస్పెండ్" అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కాగా గతేడాది అక్టోబర్ 26న అమలాపాల్ బర్త్‌డే సందర్భంగా జగత్ దేశాయ్ ప్రపోజ్ చేశాడు. అతడి లవ్‌ను యాక్సెప్ట్ చేయడంతో అమలా బర్త్‌డే రోజే జగత్ దేశాయ్ ఆమె చేతికి రింగ్ తొడిగి తన జీవితంలోకి ఆహ్వానించాడు. అనంతరం అదే రోజు వారి ఎంగేజ్‌మెంట్ జరగగా.. నవంబర్ 5న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వారి వివాహం జరిగింది. పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ తాము ఒక్కటయ్యమని ప్రకటించారు.
అమలాపాల్‍కు రెండో పెళ్లి..
2014లో డైరెక్టర్ ఏఎల్ విజయ్‍ని అమలాపాల్ ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల అతడితో విడిపోయింది. పెళ్లయిన మూడు ఏళ్లకే 2017లో విజయ్‌తో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత వ్యాపారవేత్త జగత్ దేశాయ్ ప్రేమలో పడింది. కొంతకాలం సీక్రెట్ రిలేషన్‌లో అనంతరం గతేడాది 2023లో కొద్ది మంది బంధువుల, స్నిహితుల మధ్య రెండో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. కాగా మైన అనే తమిళ మూవీతో అమలాపాల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఇక 'బెజవాడ' మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అమలా పాల్ ఇద్దరు అమ్మాయిలు, నాయక్ వంటి చిత్రాలకు స్టార్ డమ్ అందుకుంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో తిరిగి తమిళ్ ఇండస్ట్రీకే వెళ్లిపోయింది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్, అతిథి పాత్రలు.. ఆడపదడపా పాత్రలు చేస్తూ కేరీర్‌లో ముందుకు వెళుతుంది.
View this post on Instagram
>