Alpha Release Date: స్పై థ్రిల్లర్ 'ఆల్ఫా' రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్... క్రిస్మస్ కానుకగా YRF Spy Universeలో ఆలియా భట్ మూవీ
Alia Bhatt's Alpha Release Date: ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన స్పై థ్రిల్లర్ 'ఆల్ఫా' రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా అలియా భట్ మూవీ రిలీజ్ కానుంది.
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt) ప్రధాన పాత్ర పోషిస్తున్న స్పై థ్రిల్లర్ 'ఆల్ఫా'. ఈ మూవీ రిలీజ్ డేట్ (Alpha Movie Release Date) ను తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆలియా అభిమనులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందో తెలుసా?
క్రిస్మస్ కానుకగా 'ఆల్ఫా' రిలీజ్
ఆలియా భట్, శర్వారి వాఘ్ (Sharvari Wagh) హీరోయిన్లుగా నటిస్తున్న స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆల్ఫా'. ఈ సినిమాకు శివ రావెల్ దర్శకత్వం వహిస్తున్నారు. అతను గతంలో బ్లాక్ బస్టర్ 'ధూమ్ 3', షారుక్ ఖాన్ నటించిన 'ఫ్యాన్', ఆర్ మాధవన్ 'ది రైల్వే మ్యాన్' చిత్రాలకు దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో థ్రిల్లర్ ఇది. ఫస్ట్ ఫీమేల్ ఏజెంట్ మూవీ కూడా! ఇందులో ఆలియా భట్ ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా నటించి అదరగొట్టబోతోంది. దీంతో ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలను నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించి ఆలియా అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. 2025 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న 'ఆల్ఫా' మూవీని రిలీజ్ చేయబోతున్నట్టుగా తాజాగా ప్రకటించారు.
On Christmas 2025, #ALPHA will rise! Get ready for an action-packed holiday… 25th Dec, 2025.@aliaa08 | #Sharvari @shivrawail | #YRFSpyUniverse pic.twitter.com/RvOiyfUCsr
— Yash Raj Films (@yrf) October 4, 2024
YRF స్పై యూనివర్స్ లో ఇదొక మొదటి మహిళా గూఢాచారి చిత్రం. ఇందులో ఇద్దరు హీరోయిన్లు సూపర్ ఏజెంట్లుగా నటిస్తుండగా, ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అలియా భట్, శార్వరి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా అనిల్ కపూర్, బాబి డియోల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా అలియా, బాబి లకు మధ్య భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాకు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లు పని చేస్తుండడం మరో విశేషం. ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్టుగా బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ ఆలియా గురువు పాత్రలో నటించనున్నట్టుగా ఇన్సైడ్ వర్గాల సమాచారం. కాగా ప్రస్తుతం ఆలియా భట్ వలస సినిమాలతో బిజీగా ఉంది.
Also Read: 'శ్వాగ్' రివ్యూ: 'రాజ రాజ చోర' మేజిక్ రిపీట్ అయ్యిందా... శ్రీ విష్ణుకు హ్యాట్రిక్ వచ్చిందా?
'జిగ్రా'తో అలరించనున్న ఆలియా
మరోవైపు ఆలియా భట్ ప్రస్తుతం హీరోయిన్ గా నటించిన మరో మూవీ 'జిగ్రా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆమె వేదంగ్ రైనాతో స్క్రీన్‌ను పంచుకోనుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఆలియా నటించిన 'జిగ్రా' మూవీ అక్టోబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఆలియా 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. అందుకే ఆమె సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ మూవీని తెలుగుతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే 'జిగ్రా' ట్రైలర్ ను తెలుగులో కూడా రిలీజ్ చేశారు.
Also Read: శ్రీ విష్ణు 'స్వాగ్'ఓటీటీ పార్ట్నర్ ఏది? ఆ సినిమా డిజిటల్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?